Bill Gates Corona Positive: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్ చేశారు.
సాయం
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను బిల్‌గేట్స్ వెచ్చించారు.
వార్నింగ్
కొవిడ్ మహమ్మారిపై బిల్‌గేట్స్ ఇటీవల హెచ్చరించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. మరింత ప్రాణాంతకమైన, శరవేగంగా వ్యాపించే సామర్థ్యం గల కొవిడ్ వేరియంట్ దూసుకొస్తున్నదని బిల్‌గేట్స్ అన్నారు. కరోనాపై ప్రపంచాన్ని హెచ్చరించిన కొన్ని రోజులకే ఆయనకు కొవిడ్ సోకింది.