ఇంటికి వచ్చిన అప్పుని కళ్యాణ్ తీసుకుని బయాకి వెళతాడు. కనకం ప్రశాంతంగా పని చేసుకుంటుంటే మీనాక్షీ వచ్చి తిడుతుంది. ఇంట్లో కూర్చుని ముత్యాల ముగ్గులు వేసుకునే నన్ను తీసుకొచ్చి కిడ్నాపర్ ని చేశావని వణికిపోతుంది. కృష్ణమూర్తి ఇంట్లోకి రావడంతో మీనాక్షి హడావుడి చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని అంటే స్టోర్ రూమ్ కి అనేసరికి తిక్క తిక్కగా మాట్లాడుతుంది. తన మాటలు పట్టించుకోకుండా కృష్ణమూర్తి స్టోర్ రూమ్ లోకి వెళతాడు. కానీ అక్కడ వడ్డీ వ్యాపారి ఉండడు. లోపలికి వెళ్ళి తనకి కావాల్సినవి తీసుకుని వెళ్ళిపోతాడు. లోపల సేటుని చూడలేదా ఏంటని మీనాక్షి గబగబా గదిలోకి వెళ్తుంది. అక్కడ వాడు లేకపోవడం చూసి మీనాక్షి షాక్ అవుతుంది. పరుగున వచ్చి కనకానికి చెప్పేసరికి అతడిని దాచేశానని చెప్తుంది. హమ్మయ్య దాచావు కదా అని ఒక మూట మీద కూర్చుంటుంది. ఇంతకీ ఎక్కడ దాచావ్ అంటే నువ్వు కూర్చున్న మూటలో ఉంది వాడే అనేసరికి బిత్తరపోతుంది.
Also Read: రౌడీలని చితక్కొట్టి ఖుషిని కాపాడుకున్న వేద- అభి తలకి గన్ గురిపెట్టిన యష్
రాజ్ ఒక బ్యాగ్ తీసుకొచ్చి దీన్ని నేరుగా తీసుకెళ్తే డౌట్ వస్తుందని దొంగ చాటుగా తీసుకెళ్లాలని అనుకుంటాడు. తాడు తీసుకుని దానికి కట్టి మెల్లగా పైకి విసిరేస్తాడు. అదంతా కావ్య చూస్తుంది. ఈయన ఏంటి ఏదో మోసుకుని వెళ్తున్నారు, అంత రహస్యంగా ఏం తీసుకెళ్తున్నారని గమనిస్తూనే ఉంటుంది. ప్రకాశం వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావని కావ్యని అడుగుతాడు. మీ అబ్బాయి దొడ్డి దారిన ఏదో తీసుకెళ్తున్నారు ఏదో జరుగుతుంది అది ఏంటని చూస్తున్నానని చెప్తుంది. ప్రకాశం వచ్చి కింద చూసే టైమ్ కి రాజ్ బ్యాగ్ ని పైకి లాగుతూ ఉంటాడు. సరిగా అప్పుడే శుభాష్ వచ్చేసరికి బ్యాగ్ కింద విసిరేసరికి అది కాస్త ప్రకాశం నెత్తిన పడుతుంది. తండ్రిని చూసి తిక్క తిక్కగా మాట్లాడతాడు. రాజ్ కాళ్ళ దగ్గర తాడు చూసి అది కింద పడేస్తాడు. శుభాష్ వెళ్లిపోగానే కిందకి చూసేసరికి ప్రకాశం స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. నీళ్ళు కొట్టి తనని లేపి ఏదేదో మాట్లాడేసి లోపలికి పంపించేస్తాడు.
ALso Read: తులసి ప్లాన్ అదుర్స్- నందు, లాస్యకి విడాకులు
అప్పు కళ్యాణ్ ని కూలోడిని చేసి కూరగాయలు మోయిస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు ఎదురుపడి మెడలో ఉన్న చైన్ ఇవ్వమని కత్తి చూపించి బెదిరిస్తారు. భయపడిపోయిన కళ్యాణ్ అంతే కదా ఇచ్చేస్తానని అంటాడు. కానీ అప్పు మాత్రం ఏంటి ఇచ్చేది వాళ్ళకి భయపడతావ్ ఏంటని తిడుతుంది.
రేపటి ఎపిసోడ్లో..
ఎలాగో కష్టపడి రాజ్ ఆ బ్యాగ్ ని గదిలోకి తీసుకొస్తాడు. అది చూసి ఏంటి ఇది అని కావ్య అంటే తన మంచితనమని రాజ్ చెప్తాడు. అది అందరూ చూసేలాగా తీసుకురావడం ఇష్టం లేక దొంగచాటుగా తెచ్చానని అంటాడు. అప్పుడు అందులో నుంచి పరుపు తీసి వేయడం చూసి మురిసిపోతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial