ముకుంద మురారీ వాళ్ళ కంటే ముందే ఫామ్ హౌస్ కి వచ్చేసి అక్కడ ఉన్న ఆంటీని డబ్బులతో కొనేస్తుంది. తను అక్కడ ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్తుంది. అటు ఇంట్లో రేవతి ముకుంద గురించి ఆలోచిస్తుంది. తను వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళి ఉంటుంది. అయినా తనకి మురారీ మీద ప్రేమ కంటే కృష్ణకి దక్కకూడదని పంతం ఎక్కువగా కనిపిస్తుందని అనుకుంటుంది. మురారీ కృష్ణని ఫామ్ హౌస్ ఆంటీ రాజనర్స్ అని పరిచయం చేస్తాడు. వాళ్ళని దూరం నుంచి ముకుంద గమనిస్తూనే ఉంటుంది. తనకి ఫామ్ హౌస్ బాగా నచ్చిందని కృష్ణ చెప్తుంది. తన ప్రేమ విషయం చెప్పడం కోసం కావాల్సినంత ఏకాంతం దొరికింది. ముకుంద నుంచి విడుదల దొరికింది. మంచి టైమ్ చూసుకుని కృష్ణకి మనసులో మాట చెప్పేయాలని మురారీ అనుకుంటాడు.


Also Read: భర్త ప్రేమ చూసి మురిసిపోయిన కావ్య- డాక్టర్ రాకతో స్వప్న గుట్టు రట్టు అవుతుందా?


ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటారు. మీకోక విషయం చెప్పాలని కృష్ణ అనేసరికి మురారీ ఆత్రంగా ఏంటని అడుగుతాడు. కృష్ణ తన మనసులో ప్రేమ విషయం చెప్పాలని అనుకుని కూడా చెప్పకుండా ఏదేదో తిక్క తిక్కగా మాట్లాడుతుంది. మీరంటే నాకు చచ్చేంత ఇష్టం, ప్రాణమని చెప్పాలని ఉంది. కానీ డైరీ అమ్మాయికి మీ  మనసులో దేవత లాంటి స్థానం ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలని మనసులోనే బాధపడుతుంది. అదంతా ముకుంద చూస్తూనే ఉంటుంది. అలేఖ్య, మధుకర్ క్యారెక్టర్లు మార్చుకుని ముకుంద, మురారీ గా నటిస్తారు. అలేఖ్య ముకుందగా నటిస్తూ ఐలవ్యూ మురారీ అని మధుకర్ తో చెప్తుంది. అది చూసి రేవతి మధుకర్ చెంప పగలగొడుతుంది.


కృష్ణ లేకుండా ఉండలేనని తెలిసిపోయింది. ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు తనకి డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్ గానో తన ప్రేమ గురించి చెప్పీయాలని అనుకుంటాడు. వెంటనే పక్కన కృష్ణ లేదని గ్రహించి పిలుస్తాడు. మురారీ వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి కృష్ణ చెట్టు ఎక్కి కూర్చుంటుంది. వాళ్ళని దూరం నుంచి ముకుంద ఫోటోస్ తీస్తుంది. నేను వచ్చింది నా ప్రేమని బతికించుకోవడానికి అన్నట్టు లేదు వీళ్ళ ఎంజాయ్ మెంట్ చూడటానికి అన్నట్టు ఉంది. ఎలాగైనా నా ప్రేమని బతికించుకోవాలని ముకుంద డిసైడ్ అవుతుంది. కృష్ణ చెట్టు పైకి ఎక్కబోతూ కింద పడిపోతుంటే మురారీ పట్టుకుంటాడు. తనని అలాగే ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళతాడు. నీకు ఏమైనా అయితే తట్టుకోలేను కృష్ణ అని బాధపడతాడు. మురారీ ఖచ్చితంగా తన మనసులో మాట చెప్పే టైమ్ కి కృష్ణ మాటలు డైవర్ట్ చేస్తుంది. మీరు డైరీ అమ్మాయి గురించి చెప్తారు అందుకే మాట దాటేశానని అనుకుంటుంది.


Also Read: లాస్య దుమ్ముదులిపేసిన రాములమ్మ- తల్లిని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి చెప్పిన దివ్య


మూడు నెలల తర్వాత వెళ్లిపోయేలా నువ్వు కనిపించడం లేదు. నువ్వు మురారీని పర్మినెంట్ గా భర్తగా అనుకుంటున్నావా నువ్వు అలా అనుకున్నా నేను అందుకు ఒప్పుకోను. ఎలాగైనా నా ప్రేమని గెలిపించుకుంటానని ముకుంద మొండిగా ఉంటుంది. తీసిన ఫోటోస్, వీడియో స్ అన్నీ మురారీ ఫోన్ కి పంపించాలని అనుకుంటుంది కానీ వాటిని డిలీట్ చేస్తాడని అనుకుని ప్రింట్ తీసి ఫోటోస్ డైరెక్ట్ గా పంపించాలని డిసైడ్ అవుతుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial