వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్‌లోని ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 


తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. 


తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే జిల్లాలు- ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపల్‌పల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, 






కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే జిల్లాలు- నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లా, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, 


అక్కడక్కడ వర్షాలు పడే జిల్లాలు - కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లా 


మంగళవారం ఏడు జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కరవనున్నాయి.  ఆరు జిల్లాలకు అసలు వర్ష సూచనే లేదు. మిగిలిన జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడే ఛాన్స్ ఉంది. 


బుధవారం వాతావరణం పరిశీలిస్తే... పది జిల్లాలకు వర్ష సూచనే లేదు. ఏడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. 






హైదరాబాద్‌లో వాతావరణం 
హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కావచ్చు. కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం గరిష్ణ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు  ఉంటే... కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా ఉంది. 






ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ జిల్లాలతో పాటు యానాంలలో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.