Pawan Kalyan: జనసేన అధినేత పవణ్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఉపవాస దీక్ష కూడా చేస్తున్నారు. పెదఅమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్  హాల్లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జనసేనాని అస్వస్థతకు గురి కావడంతో ఉదయం 11 గంటలకు జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని  రీ షెడ్యూల్ చేశారు. ఈ సమావేశం మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇత పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరనున్నారు. 


పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే ఆయన ఆరోగ్యం సెట్ అవుతుందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.


వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా జూన్ 20 నుంచి పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. ఇది వచ్చే నెలలో ముగియనుంది. కానీ అదే టైంలో చాతుర్మాస దీక్ష ప్రారంభంకానుంది. ఈ లెక్క ప్రకారం పవన్ కల్యాణ్‌ కార్తీకర మాసం పూర్తి అయ్యే వరకు దీక్షలోనే ఉంటారు. 
ఈ దీక్షలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరు. కేవలం పాలు, పండ్లను మాత్రమే తిసుకుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో తరచూ అస్వస్థతకు గురి అవుతున్నారు. మొన్నీ మధ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూనే కాసేపు రెస్ట్ తీసుకున్నారు.