మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమాని శ్యామ్ (NTR Fan Shyam) రెండు రోజుల క్రితం మరణించారు. అతడి మృతి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని వినబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను శ్యామ్ మర్డర్ మిస్టరీ షేక్ చేస్తోంది. అభిమాని మృతి విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మనసు కలిచి వేస్తోంది - ఎన్టీఆర్
శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని జూనియర్ ఎన్టీఆర్ ఓ లేఖ విడుదల చేశారు. అభిమాని కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ''ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుంది'' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ''ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని ఆయన రిక్వెస్ట్ చేశారు.
శ్యామ్ ఎక్కడ మరణించాడు?
రిపోర్టులో ఏమని పేర్కొన్నారు?
Shyam Death Reason : ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమే శ్యామ్ మరణానికి కారణమని ప్రాధమికంగా అందుతున్న వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట. కొంత కాలంగా అతని కుటుంబం తిరుపతిలో ఉంటుంది. అక్కడ ఓ అమ్మాయితో శ్యామ్ ప్రేమలో పడ్డాడట. వారం రోజుల క్రితం అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు అతను వచ్చాడు. ప్రేమలో సమస్యలు, చదువు సాఫీగా సాగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు.
NTR Die Hard Fan Shyam : శ్యామ్ చేతి మణికట్టుపై బ్లేడ్ గాయాలు ఉన్నాయని, ఆ బ్లేడ్ అతని జేబులో ఉందని, ఆ తర్వాత ఉరి వేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే... అతనిది ఆత్మహత్యగా చెబుతున్నారు. పోలీసులు నిజాలు దాస్తున్నారని సోషల్ మీడియాలో కొంత మంది అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఉరి వేసుకుంటే కాళ్ళు నేలకు ఎలా తాకుతాయని, పోలీసులు చెబుతున్న శ్యామ్ గంజాయి తాగితే ఆ మత్తులో ఉరి వేసుకోవడం సాధ్యమేనా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
శ్యామ్ మృతి వెనుక వైసీపీ హస్తం?
శ్యామ్ మరణం వెనుక వైసీపీకి చెందిన నాయకుల హస్తం ఉందని అభిమానులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. శ్యామ్ మృతి వెనుక దోషులను శిక్షించాలని, అతడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర హీరోల అభిమానులు కూడా వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్నారు. హీరో నిఖిల్ సైతం న్యాయం చేయాలని ట్వీట్ చేశారు.
Also Read : పవర్ స్టార్ లుంగీ లుక్ కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్... 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్!
చంద్రబాబు, లోకేష్ సంతాపం...
న్యాయం చేయాలని డిమాండ్!
శ్యామ్ మర్డర్ మిస్టరీగా మారడంతో త్వరగా ఈ కేసును పరిష్కరించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అతని మరణం చుట్టూ అనుమానాలు నెలకొనడంతో త్వరితగతిన విచారణ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ మృతి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. నారా లోకేష్ కూడా శ్యామ్ మృతి పట్ల ట్వీట్ చేశారు.
శ్యామ్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం విచారకరమని, అతడి సోదరికి తాము దగ్గరుండి ఓ అన్నయ్యలా వివాహం జరిపిస్తామని కొందరు అభిమానులు పేర్కొన్నారు.
Also Read : బాలకృష్ణ 'భగవంత్ కేసరి'లో మరో అందమైన అమ్మాయి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial