Top 5 Telugu Headlines Today 17 September 2023:
అరెస్టు చంద్రబాబుకి ప్లస్సే, వచ్చే ఎన్నికల్లో ఆయనదే విజయం: రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు అంటే జగన్ మోహన్ రెడ్డికి భయం పుట్టిందని.. అందుకే ఆయనను అరెస్ట్ చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన రజాకార్ టీజర్ విడుదల కార్యక్రమానికి రాజాసింగ్ అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోషామహల్ ఎమ్మెల్యే.. చంద్రబాబు అరెస్టుపై మొదటిసారి స్పందించారు. బంతిని కిందకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుందని.. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు ఫేక్ అని కోర్టు కొట్టి వేస్తుందని తెలిపారు. పూర్తి వివరాలు
తెలంగాణ ప్రగతిరథ చక్రాలు మరింత జోరుగా ముందుకు - సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ముందుకు సాగుతూనే ఉంటాయని, దేశంలో తెలంగాణ మోడల్ మర్మోగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల దీవెనలతో ప్రగతి రథ చక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతాయని, దీనికి అడ్డుపడాలనే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మన బలం అని అన్నారు. సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు అయ్యారు. పబ్లిక్ గార్డెన్స్ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పూర్తి వివరాలు
ఏపీలో పెరుగుతున్న నిరసనలు - సీఎం జగన్ టీడీపీకి చేజేతులా అవకాశం కల్పించారా ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అవినీతి జరిగిందని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ పై అనేక వివాదాలు ఉన్నాయి. అదే సమయంలో కోర్టులో కౌంటర్లు దాఖలు చేయడానికి వారాల తరబడి గడువు అడుగుతున్న లాయర్లు ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి వివరాలు చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నామని బెదిరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం వేడేక్కుతోంది. చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు ఒక్క సారిగా పెరుగుతూండటం అధికార పార్టీని సైతం ఆశ్చర్య పరుస్తోంది. పూర్తి వివరాలు
వాళ్లు చరిత్రను వక్రీకరించారు, ప్రధాని మోదీ సవరిస్తున్నారు - విమోచన దినోత్సవంలో అమిత్ షా
కేంద్ర హోం మంత్రి తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు విముక్తి కలిగించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వాళ్లను స్మరించుకోవాల్సిన సందర్భమిదే అన్నారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్దాల్ పటేల్ లేకపోతే...ఈ విమోచన సాధ్యమయ్యేది కాదని తేల్చి చెప్పారు. రజాకార్ల పోరాడి అమరులైన యోధులకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపడానికి పలు కారణాలున్నాయని వివరించారు అమిత్ షా. నాటి పోరాట యోధుల్ని ప్రస్తుత తరానికి గుర్తు చేయడం, పోరాట యోధుల్ని సన్మానించడం కోసమే అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలు
ఏపీ స్కిల్ కేసు బోగస్, ఈ ఆరోపణలు చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాట్లేదు - సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‍మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ అన్నారు. తన జీవితంలో తాను ఎంతో గౌరవం సంపాదించుకున్నానని అన్నారు. ఒక హత్య జరిగితే విచారణ చేస్తారని.. కానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచిత్రంగా హత్యకు (స్కామ్) గురైనట్లుగా చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడని అభివర్ణించారు. బతికుండగానే హత్య (స్కామ్) జరిగిందని విచారణ చేస్తామంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు