ఏపీ రాజకీయాల్లో అంచనా వేయలేని పరిణామాలు - అమిత్ షా, చంద్రబాబు భేటీలో ఏం జరిగింది?
అసలు ఆ రోజు ఏం జరిగింది.. ? తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యే వారందరికీ ఇప్పుడు  అదే డౌట్. జూన్ 3 వ తేదీ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏదో జరిగింది. అందకే తెలుగు రాజకీయ క్షేత్రంలో అంతటి మార్పు.  దానిని అన్ని పార్టీల వాళ్లూ రకరకాలుగా అన్వయించుకుంటున్నారు. బీజేపీ మా నుంచి దూరం అయిందని వైసీపీ చెప్పగానే అంతా టీడీపీకి చేరువైందేమో అనుకుంటున్నారు. కానీ ఏపీ పొలిటికల్ సీన్ అలా కనిపించడం లేదు. అసలు ఏం జరిగి ఉండటానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఒకటే అలజడి. ఉన్నట్లుండి బీజేపీ పెద్ద టర్న్ తీసుకుంది. ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా మాటల యుద్ధం ప్రారంభించింది. అది కూడా స్థానిక నాయకులు కాదు. భారతీయ జనతా పార్టీ టాప్ బాస్‌ లే వైసీపీపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు 


టిడ్కో ఇళ్లకు చంద్రబాబు చేసింది జీరో, గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు: సీఎం జగన్
రాష్ట్రంలో తాము నిర్మిస్తున్నవి ఇళ్లు కాదని.. కాలనీలని పునరుద్ఘాటించారు సీఎం జగన్. అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చామన్నారు. జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయని వివరించారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం జగన్. ఇప్పుడు వాటి రేటు 7 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇళ్లు కట్టడం పూర్తై ఆ రేటు 15 నుంచి 20 లక్షల రూపాయలు అవుతుందన్నారు.  పూర్తి వివరాలు


చంద్రబాబు ఒక్క ఎకరమైనా ఇచ్చి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని
గుడివాడలో పేదల ఇళ్ల నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో జగన్‌తో కలిసి పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న వైఎస్‌ కలను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారా నెరవేరుతతోందని అన్నారు. గుడివాడలో మంగాయాపాలెంలో టిడ్కో గృహాల పంపిణీ చేపట్టడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు నాని. రూ.800 కోట్ల ప్రాజెక్టుకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. అందులో కూడా రూ.160 కోట్లు కేంద్రమే ఇచ్చిందని అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే రూ.400 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేటాయించారని చెప్పుకొచ్చారు నాని. కానీ చంద్రబాబు గుడివాడ వచ్చిన ప్రతీసారి కబుర్లు చెప్పి వెళ్లిపోతాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ సొంత ఊరు గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు కొడాలి నాని.  పూర్తి వివరాలు  


దేశంలో మరో 10,15 రాష్ట్రాలు ఉంటే తప్పేంటీ? కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికా లాంటి దేశంలోనే 50 రాష్ట్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్‌లో ఉంటే నష్టమేంటని అంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌... మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చాలా విషయాలు వివరించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో వివరించారు. వీటితోపాటు దేశంలో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్‌పై కూడా స్పందించారు.  పూర్తి వివరాలు  


దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ - అన్ని పార్టీలూ ఆలోచించాలన్న తెలంగాణ బీజేపీ నేత !
బీజేపీ సీనియర్ నేత  మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు  భారత్ కు రెండవ రాజధానిగా  హైదరాబాద్  అయ్యే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు.  రాజ్యాంగంలో ఈ అంశం ఉందని తెలిపారు.  గతంలో కూడా విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ గా చేసిన తర్వాత విద్యాసాగర్ రావు కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి.    పూర్తి వివరాలు