తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫొటోఫ్రేమ్స్‌ తయారీ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పని చేస్తున్న సిబ్బంది భయం పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగిన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫొటో ఫ్రేమ్ షాపులో చెలరేగిన మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందడంతో అక్కడిచకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.                                   


మంటలు అంటుకున్న చోట గోందరాజు స్వామి రథం ఉంది. ఆ రథం కూడా అగ్నికి కాలిపోయిందన్న ప్రచారం జరిగింది.  రథానికి కూడా మంటలు అంటుకున్నాయి కానీ.. రథం పూర్తిగా కాలిపోలేదు. వెంటనే ఆలయ సిబ్బంది .. రథంపైకి ఎక్కి మంటలను ఆర్పేశారు. మళ్లీ అంటుకోకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు.  మరో వైపు ఈ అగ్నిప్రమాదం కారణంగా మాఢవీదిలో రాకపోకలు నిలిపివేశారు. మంట‌లు ఇప్ప‌టి వ‌ర‌కు అదుపులోకి రాక‌పోగా ప‌క్క‌నే ఉన్న మ‌రో బిల్డింగ్ కు వ్యాపించాయి.. దీంతో మ‌రో నాలుగు ఫైరింజ‌న్లు అక్క‌డికి చేరుకున్నాయి.. ఈ అగ్ని ప్ర‌మాదంలో ఫోటో ప్రేమ్ ఉన్న భ‌వ‌నంతో పాటు మాడ‌వీధిలో వేసిన చ‌లువ పందిళ్లు, అక్క‌డ రోడ్డుపై పార్క్ చేసిన కొన్ని బైక్ లు కాలి బూడిద‌య్యాయి..


 లావణ్య ఫోటో ఫ్రేముల కంపెనీలో అంటుకున్న మంటలు ఈ రథాన్ని కూడా తాకాయి. అసలే ఇరుకు వీధులు కావడం, చుట్టూ అనేక బొమ్మల దుకాణాలు ఉండటంతో భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపుచేస్తున్నప్పటికీ ఈ ప్రమాదం కచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. గోవిందరాజపురం ఆలయ మాడవీధులన్నీ ఇరుకుగా ఉంటాయి. తూర్పు మాడవీధి పూర్తి మెయిన్‌రోడ్డుగా మారిపోయింది. దక్షిణ, ఉత్తర మాడవీధులు ఇరుకు సందులుగా కనిపిస్తాయి. ఇక పడమర మాడవీధిలో కీలకమైన ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఉండటం వలన ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో రద్దీగా ఉంటుంది.  


ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన లావణ్య లామినేషన్‌ భవనం ఉత్తర మాడవీధి మొదట్లో ఉంటుంది. ఈ వీధి మొదట్లోనే ఓ పక్కగా స్వామివారి రథాన్ని నిలిపి ఉంచుతారు. నిజానికి ఈ రథం చుట్టూ రేకులతో రక్షణ కవచం ఉంటుంది. బహుశా మొన్నే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి కాబట్టి ఆ రేకులను తొలగించారు. వాటిని ఇంకా అమర్చలేదు. దీంతో లావణ్య ఫోటో ఫ్రేముల కంపెనీలో అంటుకున్న మంటలు ఈ రథాన్ని కూడా తాకాయి. అసలే ఇరుకు వీధులు కావడం, చుట్టూ అనేక బొమ్మల దుకాణాలు ఉండటంతో భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ప్రమాదం జరిగిన తరవాత వేగంగా స్పందించినప్పటికీ.. మంటలు శరవేగంగా  విస్తరించాయి. ఈ ప్రమాద ఘటన  ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్,  ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీల నేతలు కూడా సందర్శించారు.