ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ - జనసేనలో చేరనున్న ఆమంచి సోదరుడు !
చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు   పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.గతంలోనే పవన్ కల్యాణ్‌తో సమావేశమై పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. ఇప్పటికే స్వాములు చీరాలలో పార్టీ ఆఫీసుకును కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా  ఆమంచి   అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు జనసేన ఆఫీస్‌కు  భారీగా తరలి వెళ్లనున్నారు. జనసేన నుండి తనకు సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ విధానాలు నచ్చి..ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్వాములు చెబుతున్నారు.  పూర్తి వివరాలు


గంజాయి కేంద్రంగా ఏపీ - గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నారా లోకేష్ !
ఏపీలో వ్యవస్థీకృతంగా సాగుతున్న గంజాయి సాగు, రవాణా గురించి గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు.  సుమారు అరగంట సేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో లోకేష్ సమావేశం అయ్యారు.  దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా మెడిన్ ఏపీ అనే అంటున్నారని..  పాదయాత్రలో గంజాయి వినియోగం వల్ల నాశనమైన కుటుంబాల వ్యధలు తన దృష్టికి వచ్చాయని గవర్నర్ తెలిపారు.  ఏపీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి కారణం గంజాయి మత్తేనన్నారు.  సీఎం జగన్ నివాసానికి సమీపంలో జరిగిన ఘటనలకు గంజాయి మత్తే కారణమని గుర్తుచేశారు.  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులోనే తన డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేశాడని..  ఉడ్తా పంజాబ్ సినిమా తరహాలో ఇప్పుడు ఉడ్తా ఏపీ అంటున్నారని విమర్శించారు.  పూర్తి వివరాలు  


సుకేశ్‌కు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్- క్షమాపణ చెప్పాలని డిమాండ్
సుఖేశ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి క్రిమినల్‌ను తాను ఎప్పుడూ కలవలేదంటూనే అతనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలాంటివి ప్రచురించే ముందు మీడియా కూడా ఆలోచించుకోవాలని సూచించారు. గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్‌ ఈసారి కేటీఆర్ ప్రస్తావ తీసుకొచ్చారు. ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్టు కూడా ఆయన లాయర్‌ చెప్పుకొచ్చారు. దీనిపై కేటీఆర్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్‌ హెచ్చరించారు.  పూర్తి వివరాలు  


కాంగ్రెస్ కుట్రలో భాగంగానే రేవంత్ ప్రకటన - రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య కరెంట్ మంటలు కొనసాగుతున్నాయి. రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని.. బీఆర్ఎస్ మంత్రులు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా, రాష్ట్రాల వారీగా ఒక విధానం అంటూ ఉన్నదా ? అని.. పల్లా రాజశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.  తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు వ్యవహరిస్తున్నారని.. పొరపాటున తప్పులు మాట్లాడితే సరిదిద్దుకోవాలి కానీ ఎదురుదాడికి దిగడం పద్దతికాదన్నారు.  పూర్తి వివరాలు  


అన్నవరం దేవస్థానంలో ఏం జరుగుతోంది? వివాదం ఎక్కడ మొదలైంది?
కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో రోజూ భారీ సంఖ్యలో భక్తు వస్తూ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. శుభకార్యాలు జరిపించుకొని వెళ్తుంటారు. అలాంటి దేవాలయం విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. భక్తులపై మరింత భారం పెరిగేలా దేవస్థానం అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శుభకార్యాల కోసం పురోహితులు, భజంత్రీలు, అలంకరణ ఏర్పాట్లు ఇలా అన్నీ వేలం పాట ద్వారా కాంట్రాక్టుదారునికి అప్పగించే చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.  పూర్తి వివరాలు