Lokesh Meet Governer :  ఏపీలో వ్యవస్థీకృతంగా సాగుతున్న గంజాయి సాగు, రవాణా గురించి గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు.  సుమారు అరగంట సేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో లోకేష్ సమావేశం అయ్యారు.  దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా మెడిన్ ఏపీ అనే అంటున్నారని..  పాదయాత్రలో గంజాయి వినియోగం వల్ల నాశనమైన కుటుంబాల వ్యధలు తన దృష్టికి వచ్చాయని గవర్నర్ తెలిపారు.  ఏపీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి కారణం గంజాయి మత్తేనన్నారు.  సీఎం జగన్ నివాసానికి సమీపంలో జరిగిన ఘటనలకు గంజాయి మత్తే కారణమని గుర్తుచేశారు.  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులోనే తన డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేశాడని..  ఉడ్తా పంజాబ్ సినిమా తరహాలో ఇప్పుడు ఉడ్తా ఏపీ అంటున్నారని విమర్శించారు.


గంజాయి రవాణాపై కనీస సమక్ష చేయని సీఎం 


ఇన్ని ఘటనలకు గంజాయి కారణంగా ఉంటే.. సీఎం జగన్ డీజీపీని పిలిచి కనీసం వివరాలు కూడా అడగలేదన్నారు.  ఆర్జీవీ తీసే సినిమాపై రివ్యూ చేయడానికి జగనుకు సమయం ఉంది కానీ.. గంజాయి నివారణకు చర్యలు తీసుకోవడానికి లేదా..? అని లోకేష్ ప్రశ్నించారు.  జగన్, వైసీపీ నేతల సహకారంతోనే గంజాయి వినియోగం పెరుగుతోందన్నారు.  పోలీస్ వ్యవస్థ అంత కఠినంగా ఉంటే గంజాయి కారణంగా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని.. ప్రశ్నించారు.  ఏపీలో క్రైమ్ రేట్ పెరగడానికి గంజాయే కారణమని..  సీఎం ఇంటి సమీపంలో పార్క్ చేసిన వాహానాలను గంజాయి మత్తులో తగులబెట్టేస్తున్నారని గుర్తు చేశారు. 


పిల్లలకు గంజాయి అలవాటు చేసి.. వారినే డీలర్లుగా మారుస్తున్న వైనం


చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు...తర్వాత ఆ పిల్లలనే డీలర్లుగా మారుస్తున్నారని ఆరోపించారు.  2021-22 సంవత్సరంలో 18 వేల కేజీలకు పైగా గంజాయిని  పట్టుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాక.. గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో అర్థమైందన్నారు.  ఈ విషయాలన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని మీడియాకు లోకేష్ తెలిపారు. 


పాదయాత్రపై కుట్రలు


తన  పాదయాత్ర సందర్భంగా వైసీపీ నేతలు కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు..టీడీపీ నేతలపై భౌతిక దాడులకూ పాల్పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు మా మీద దాడులు చేస్తున్నారు.. వాళ్ల ఫ్లెక్సీలకు సీఐ స్థాయి అధికారులతో భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు.  రాజ్యాంగానికి లోబడే వలంటీర్లైనా ఎవరైనా పని చేయాల్సిందేనని..   ప్రభుత్వం దగ్గర ఇప్పటికే సమాచారం ఉందని.... మళ్లీ వలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సిన అవసరమేముందని లోకేష్ ప్రశ్నించారు.  


వలంటీర్లను సేవకే పరిమితం చేస్తాం !


వలంటీర్లను రాజకీయ కార్యకలాపాలకు వాడకూడదని.. స్పష్టం చేశారు.  ప్రభుత్వ ఖజానా నుంచి వలంటీర్లకు వేతనం ఇస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. వలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర వ్యవస్థగా మారకూడదనేది మా పార్టీ విధానం... ఉన్న వ్యవస్థలతో సమన్వయం చేసుకుని వలంటీర్ తరహా వ్యవస్థ ఉండాలనేదే మా విధానమని స్పష్టం చేశారు. 


ముందస్తు ఎన్నికల గురించి సజ్జలనే అడగాలని లోకేష్ మీడియాకు సూచించారు.  ముందస్తుకు వెళ్లాలంటే ముందుగా ఇచ్చిన హామిలను నెరవేర్చాలి కదా..? అని ప్రశ్నించారు.