Asian Games Team India Squad: దాదాపు పదేండ్ల తర్వాత  ఆసియా క్రీడల్లో ఆడించనున్న క్రికెట్  పోటీలలో పాల్గొనబోయే భారత జట్లను  బీసీసీఐ ప్రకటించిది. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య  చైనాలోని హాంగ్జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు జరుగనున్నాయి. టీమిండియా  పురుషుల జట్టుకు మహారాష్ట్ర బ్యాటర్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే  ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.  ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 


యువ మంత్ర.. 


ఈ ఏడాది అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉండబోయే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు స్థానంలో బీసీసీఐ యువమంత్రాన్ని పఠిస్తున్నది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో మెరుస్తున్న యువ క్రికెటర్లను ఆసియా క్రీడలకు పంపించనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ టీమ్‌లో జితేశ్ శర్మ,  రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,  శివమ్ దూబేలతో పాటు  ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ, సాయి కిషోర్ లకు సెలక్టర్లు చోటు కల్పించారు. 


కొద్దిరోజుల క్రితం.. ఆసియా క్రీడలకు వెళ్లే టీమ్‌కు  శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ సెలక్టర్లు ఒక్క ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ కూడా లేకుండానే ఆసియా క్రీడల్లో  భారత జట్టును ఆడించనుంది. నిన్న ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు, ముగ్గురికి తప్ప మిగిలినవారికి టీమిండియా తరఫున కనీసం 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడాలేదు. చాలా మంది  కొత్తముఖాలే కావడం గమనార్హం. 


 






టీ20 ఫార్మాట్‌లో నిర్వహించబోయే  ఈ ఈవెంట్‌ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకూ జరుగనుంది. సుమారు 18 జట్లు పాల్గొనబోయే ఆసియా క్రీడల్లో భారత జట్టు నేరుగా క్వాలిఫై ఆడే అవకాశముంది. 


ఆసియా క్రీడలకు భారత  క్రికెట్ జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 


స్టాండ్ బై ప్లేయర్స్ : యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ 


ఇక మహిళల టీమ్ విషయానికొస్తే  సెప్టెంబర్ 19 నుంచి 28 వరకూ  మమిళల క్రికెట్ పోటీలు  జరుగుతాయి. బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ రిచా ఘోష్.. జట్టులో తిరిగి  చోటు దక్కించుకుంది. సీనియర్ పేసర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోగా, శిఖా పాండేకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇటీవలే ముగిసిన అండర్ - 19 టీ20 వరల్డ్ కప్  ఫైనల్ లో రాణించిన టిటాస్ సాధుతో పాటు ఆర్సీబీ ఆల్ రౌండర్ కనిక అహుజాలు తొలిసారి జట్టుకు ఎంపికయ్యారు.  డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన స్పిన్నర్ సైకా ఇషాక్  కూడా స్టాండ్ బై ప్లేయర్ గా జట్టులో చోటు దక్కించుకుంది. 


ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి, అనూష బారెడ్డి 


స్టాండ్ బై ప్లేయర్లు : హర్లీన్ డియోల్, కశ్వి గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రకార్ 



































Join Us on Telegram: https://t.me/abpdesamofficial