తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి- బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు! 
మరి కొన్ని నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని దృష్టిలో పెట్టుకున్న బీజేపీక పార్టీలో కీలక మార్పులు చేయబోతోంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమయంలో రాష్ట్రాల్లోని అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణ, గజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చబోతోంది.  పూర్తి వివరాలు 


భట్టిని మోచేతితో నెట్టేసిన కోమటి రెడ్డి, ప్లకార్డు విసిరికొట్టిన పొంగులేటి- వైరల్ అవుతున్న వీడియోలు 
ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికలతోపాటు కాంగ్రెస్ ఐక్యతను కూడా చాటి చెప్పాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. ఇప్పటి వరకు విభేదాలు ఉన్న వారంతా ఒకే స్టేజ్‌పైకి రావడంతో అంతా సవ్యంగా ఉందనే కలరింగ్ ఇచ్చారు. సమావేశం చివరిలో జరిగిన ఘటనలు మాత్రం కాంగ్రెస్‌ను కలవరపరుస్తున్నాయి. ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఖమ్మం సభా వేదికపై నేతలంతా ఐక్యంగా ఉన్నట్టు చెప్పుకున్నా ఆఖరిలో జరిగిన ఘటనలు మాత్రం కాంగ్రెస్ శ్రేణులను కలవర పెడుతున్నాయి.  పూర్తి వివరాలు 


జెండా ఊపి 108 అంబులెన్సులను ప్రారంభించిన సీఎం జగన్  
108 అంబులెన్సుల వాహనాలను ఏపీ సీఎం జగన్.. జెండా ఊపి మరీ ప్రారంభించారు. మొత్తం 146 నూతన అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా.. కొత్త అంబులెన్సులో ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రారంభోత్సవ అనంతరం 108 అంబులెన్స్ వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   పూర్తి వివరాలు


దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్‌ఎస్‌- రాహుల్‌ గాంధీకి మంత్రి కేటీఆర్‌ కౌంటర్ 
బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ బంధువుల పార్టీ అంటూ ఖమ్మంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వస్తోంది. రాహుల్‌ చేసిన విమర్శలపై ట్విటర్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్‌ పెద్ద వ్యాసమే రాసుకొచ్చారు. తమకు బంధువులు పార్టీ కాదని, కాంగ్రెస‌్యే  భారత రాబందలు పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..."మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. ఏఐసీసీ అంటేనే... అఖిల భారత కరప్షన్ కమిటీ. దేశంలో... అవినీతికి, అసమర్థతకు.. ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్. స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను..దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ... ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్.. బీఆర్ఎస్.   పూర్తి వివరాలు


మరోసారి తెరపైకి చైతన్య రథం- ఎన్నికల దగ్గర రీరిలీజ్‌కు ప్రయత్నాలు!  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన చైతన్య రథం చిత్రం రి రిలీజ్ అవుతోంది. ప్రస్తుత రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారటం, మరోవైపున వంగవీటి జయంతి రోజునే మరోసారి ఈ చిత్రాని రిలీజ్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది. వంగవీటి మోహన రంగా పేరు ఇప్పటికీ రాజకీయంగా హాట్ టాపిక్. వంగవీటి మోహన రంగా జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఆయన బతికి ఉండగానే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా అందించారని, షూటింగ్ స్పాట్‌లో కూడా చాలా సేపు గడిపేవారని చెబుతున్నారు. పూర్తి వివరాలు 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial