ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికలతోపాటు కాంగ్రెస్ ఐక్యతను కూడా చాటి చెప్పాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. ఇప్పటి వరకు విభేదాలు ఉన్న వారంతా ఒకే స్టేజ్‌పైకి రావడంతో అంతా సవ్యంగా ఉందనే కలరింగ్ ఇచ్చారు. సమావేశం చివరిలో జరిగిన ఘటనలు మాత్రం కాంగ్రెస్‌ను కలవరపరుస్తున్నాయి. ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి.
ఖమ్మం సభా వేదికపై నేతలంతా ఐక్యంగా ఉన్నట్టు చెప్పుకున్నా ఆఖరిలో జరిగిన ఘటనలు మాత్రం కాంగ్రెస్ శ్రేణులను కలవర పెడుతున్నాయి. నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నామని చెప్పేందుకు వేదికపై ఉన్న నాయకులు ప్లకార్డుల పెట్టి చూపించారు. ఈ క్రమంలోనే వారి మధ్య తోపులాట జరిగింది. మీడియాకు కనిపించాలనో, లేదా రాహుల్ దృష్టిలో పడాలనో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నేతలు ఒకరినొకరు నెట్టుకున్నారు.
వేదికపై ప్లకార్డు చూపిస్తున్న టైంలో కోమటి రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య తోపులాట జరిగింది. కోమటిరెడ్డిని కాస్త జరగాలని భట్టి సూచించారు. ఇంతలో వెనుక నుంచి వేరే నాయకుడు నెట్టుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అదై టైంలో కోమటి రెడ్డి తన మోచేతితో భట్టి విక్రమార్కను గట్టిగా నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత తన వెనుక ఉన్న లీడర్‌కు కోమటి రెడ్డి వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు కూడారికార్టు అయ్యాయి.
ప్లకార్డుల ప్రదర్శన అయిపోయిన తర్వాత రాహుల్ అక్కడి నుంచి బయల్దేరుతున్న టైంలో తన చేతిలో ఉన్న ప్లకార్డును పొంగులేటి నేలకేసి కొట్టగం గమనించవచ్చు. ఇది కూడా వైరల్‌గా మారుతోంది. ఇలా ఐక్యంగా ఉంటారనుకున్న వారంతా ఒక్కొక్కరు ఒక్కో తీరున రియాక్ట్ కావడం ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ వీడియోలను ప్రత్యర్థి పార్టీలు వైరల్ చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో క్యాప్షన్ పెట్టి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు సమర శంఖం పూరించింది. అర్హులైన వారందరికీ 4000 వరకు పింఛన్ ఇస్తామని ఇదే వేదికపై రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే టైంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీకి బీ టీంగా బీఆర్‌ఎస్ ఉందని ఆరోపణలు చేశారు. అందుకే కేసీఆర్ చేసే అవినీతిని మోదీ వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన రిమోట్ మోదీ చేతిలో ఉందని విమర్శలు చేశారు.
సభ జరుగుతుందని తెలిసినప్పటి నుంచి అధికార పార్టీ ఆంక్షలు విధించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం, ప్రైవేట యాజమాన్యాలను బెదిరించడం ఇలా సభకు ఎన్నో ఇబ్బందు పెట్టిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్నింటినీ ఛేదించుకొని కార్యకర్తలు, ప్రజలు ఖమ్మం జనగర్జన సభకు భారీగా తరలి వచ్చారని అభిప్రాయపడుతున్నారు నేతలు. ఎన్ని ఇబ్బందులు పాల్జేసిన ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ అయిందని లెక్కలు వేసుకుంటున్నారు.
Also Read: డేట్ రాసిపెట్టుకోండి, ఆరోజే కాంగ్రెస్ అధికారంలోకి రానుంది: రేవంత్ రెడ్డి
Also Read: తెలంగాణలో బీజేపీ అడ్రస్ గల్లంతు! కారు 4 టైర్లు పంక్చర్ అయ్యాయి- ఖమ్మం సభలో రాహుల్ సెటైర్లు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial