Wiener Zeitung:
ఆ చట్టం వల్లే..
ప్రపంచంలోనే అతి పాత డెయిలీ న్యూస్ పేపర్‌గా రికార్డు సాధించిన పత్రిక ఇకపై మార్కెట్‌లో కనిపించదు. 320 ఏళ్ల తరవాత పేపర్ ప్రింటింగ్ ఆపేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. వియన్నాకు చెందిన Wiener Zeitung న్యూస్ పేపర్ 320 ఏళ్లుగా నిర్విరామంగా పని చేస్తోంది. ఇన్నేళ్ల తరవాత లాస్ట్ ఎడిషన్ ప్రింట్ చేసి...ఇకపై ప్రింటింగ్ ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన చట్టం వల్ల తీవ్రంగా నష్టపోయింది కంపెనీ. పేపర్‌లో యాడ్స్ వేసే కంపెనీలు డబ్బులు చెల్లించాల్సిన పని లేదని ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యాడ్స్ రెవెన్యూతో లాక్కొస్తున్న వీనర్ జెయిటంగ్ న్యూస్ పేపర్‌పై ఈ నిర్ణయం గట్టి ప్రభావం చూపించింది. ఆర్థికంగా బాగా నష్టపోయింది. ఈ దెబ్బకు 63 మంది ఉద్యోగులనూ తొలగించింది. ఎడిటోరియల్ స్టాఫ్‌లో 55 మంది ఉండగా..20 మందికే కుదించింది. పరిస్థితులు మరీ దిగజారడం వల్ల కఠిన నిర్ణయం తీసుకుంది. వందల ఏళ్లుగా ప్రజలకు వార్తలు చేరువ చేసిన న్యూస్ పేపర్...ఇకపై మార్కెట్‌లో ఎక్కడా దొరకదు. ఈ జూన్ 30న లాస్ట్ ఎడిషన్ ప్రింట్ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్లే తమకు నష్టం వాటిల్లిందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రింటింగ్ ఆపేస్తున్నామని ఎడిటోరియల్ పబ్లిష్ చేసింది.
"నిజాయతీతో కూడిన జర్నలిజానికి ఇవి రోజులు కావు. చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫేక్ న్యూస్‌తో అటెన్షన్ గెయిన్ చేయాలని చూసే వాళ్లే తప్ప సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని చూసే వాళ్లే లేరు. వార్తల పేరుతో విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు"
- వీనర్ జెయిటంగ్ యాజమాన్యం
ఆన్‌లైన్ ఎడిషన్ కొనసాగుతుందట..
అయితే ఆన్‌లైన్ ఎడిషన్ మాత్రం కొనసాగనుంది. నెలకోసారి ఓ ఎడిషన్‌ని ప్రింట్ చేయాలని ప్రస్తుతానికి ప్లాన్ చేసుకున్నా...అది సాధ్యమవుతుందా లేదా అన్న ఆలోచనలో పడింది. 1730 ఆగస్టులో మొదలైంది Wiener Zeitung పత్రిక. ఇన్నేళ్లలో దాదాపు 12 మంది ప్రెసిడెంట్‌లు మారిపోయారు. ఎలాంటి పక్షపాతం లేకుండా కచ్చితమైన సమాచారాన్ని అందిస్తామని ఫస్ట్ ఎడిషన్‌లోనే ప్రకటించింది. ఈ ఏడాది సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. వారానికి 20 వేల పత్రికలు అమ్మడమే కష్టమైపోయింది. వారాంతాల్లో కాస్తో కూస్తో సర్క్యులేషన్ పెరిగినా...ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. అందుకే...ప్రింటింగ్ ఆపేస్తున్నట్టు ప్రకటించింది.
AI ఎఫెక్ట్ కూడా..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోంది. మ్యాన్‌పవర్‌ని తగ్గించుకుని AIపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడీ లిస్ట్‌లోకి కొన్ని వార్తా సంస్థలూ వచ్చి చేరుతున్నాయి. జర్మనీలో పాపులర్ న్యూస్ ఆర్గనైజేషన్ Axel Springer ఇదే పని చేసింది. దాదాపు 20% మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానాన్ని AI టెక్నాలజీతో రీప్లేస్ చేసింది. ఇకపై దశల వారీగా వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని పూర్తిగా AIతోనే కంపెనీ రన్ చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఎడిటర్ స్థాయి వ్యక్తుల నుంచి రైటర్స్, డిజైనర్స్ వరకూ అందరి స్థానాన్నీ రీప్లేస్ చేస్తోంది ఈ టెక్నాలజీ. ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో మథియాస్ డాఫ్నర్ వెల్లడించారు. ఎలన్ మస్క్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన Mathias Dopfner "డిజిటల్ ఓన్లీ అప్రోచ్" అనే విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పబ్లిషర్ సంస్థ ఇందుకు సంబంధించి మెమొరాండం కూడా విడుదల చేసింది. ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్‌తో పాటు మరి కొన్ని రోల్స్‌ని కూడా త్వరలోనే తొలగించనున్నారు. వాళ్ల స్థానంలో పూర్తిగా డిజిటలైజ్డ్ టెక్నాలజీ వచ్చేస్తుంది.
Also Read: అబ్బో అదో నరకం, భరించడం మా వల్ల కాదు - పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించని చైనా యూత్