China Youth: 


గృహ హింసే కారణం..


చైనాలో గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా...అక్కడి యువతీ యువకులు పెళ్లంటేనే భయపడిపోతున్నారు. అంతే కాదు. అసలు పెళ్లి అవసరమా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భార్య భర్తపైన దాడి చేయడం, భర్త భార్యను చంపడం లాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. షాండాంగ్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. తన కార్‌తో తొక్కి చంపాడు. ఆ తరవాత విచారణ తేలిందేంటంటే...ఆ మృతురాలు నిందితుడి భార్యే. భార్యను తన కార్‌తో తొక్కి మరీ ప్రాణాలు తీశాడు. మధ్యలో డోర్ తీసి దిగి ఆమె చనిపోయిందా లేదా అని కన్‌ఫమ్ చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉందని గమనించి మరోసారి కార్‌ ఆమెపై నుంచి పోనిచ్చాడు. చనిపోయిందని నిర్ధరించుకున్నాక ఆగిపోయాడు. ఈ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఘటనతో యువతీ యువకులు భయపడిపోయారు. పెళ్లి చేసుకోవడం ఎందుకు..? ఇలా రోడ్డున పడడమెందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. 


మహిళలే బాధితులు..


చాలా ఘటనల్లో మహిళలే బాధితులు అవుతుండటం అమ్మాయిలను మరింత టెన్షన్ పెడుతోంది. గత నెల గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్యను, ఆమె సోదరిని కత్తితో పొడిచి చంపాడు. ఎన్నో ఏళ్లుగా గృహ హింసను ఎదుర్కొంటున్న ఆమె విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేసుకుంది. ఇది తెలిసి కోపంతో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అంతకు ముందు ఏప్రిల్‌లో మరో మహిళ తృటిలో చావు నుంచి తప్పించుకుంది. హోటల్‌లో తన భర్త దారుణంగా దాడి చేశాడు. దాదాపు 8 రోజుల పాటు ICUలో ఉండి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుంది. డైవర్స్‌కి అప్లై చేసినందుకు ఇలా చావబాదాడు. సోషల్ మీడియాలో ఆ బాధితురాలు పోస్ట్ పెట్టింది. రెండేళ్లలో తనపై 16 సార్లు దాడి చేశాడని చెప్పింది. ఈ పోస్ట్ కూడా వైరల్ అయింది. ఈ ఘటనలతోనే అక్కడి యూత్ పెళ్లంటేనే ఆమడ దూరం పారిపోతోంది. "మా వల్ల కాదు" అని తేల్చి చెప్పేస్తోంది. 


Also Read: Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్టే! జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు అర్థం అదేనా!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial