Top Headlines In Telugu States on 8th March:
1. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర రామలింగేశ్వర ఆలయం, వేయిస్తంభాల గుడి, కోటిపల్లి, ద్రాక్షారామం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గోదావరి నదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఎన్డీఏలోకి టీడీపీ - సీట్లపై కుదిరిన అవగాహన
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చేరడం ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. గురువారం రాత్రి జరిగిన చర్చల్లో ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఇన్ని రోజులు సాగిన పొలిటికల్ సీరియల్‌కు శుక్రవారం పుల్‌స్టాప్ పడనుంది. ఇకపై కొత్త ఎపిసోడ్ ప్రారంభం కానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అవగాహనకు వచ్చాయని సమాచారం. మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేయనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై విజయసాయిరెడ్డి వ్యంగ్య ట్వీట్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. 2014 - 19 మధ్య కాలంలో రాష్ట్రానికి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్ధాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది.? అంటూ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. జీవో నెం.3 రద్దు డిమాండ్ తో ఎమ్మెల్సీ కవిత ధర్నా
ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత దీక్ష చేశారు. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాంతర రిజర్వేషన్లు అమలు చేసేలా విడుదల చేసిన జీవో నంబర్ 3ను రద్దు చేయాలన్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్ మద్దతు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయలేనన్న మల్లారెడ్డి
మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసే చాన్స్ లేదని .. టిక్కెట్ వేరే వాళ్లకు ఇవ్వాలని మేడ్చల్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి .. భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన కుమారుడు భద్రారెడ్డికి ఎంపీ టిక్కెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ కూడా భద్రారెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో మల్లారెడ్డి తన కుమారుడి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. అయితే హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోటీ చేయలేనని చేతులెత్తేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.