తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ఆదాయాన్ని పొందుతోంది. ఈ విషయం ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంగా ఏర్పడిన ఏడేళ్ల కాలంలో  తెలంగాణ జీఎస్డీపీ ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. అనేక రంగాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. 2013-14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020-21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. తెలంగాణలో ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఫార్మా రంగంతో పాటు వ్యవసాయం కూడా భారీగా అభివృద్ధి చెందాయి. 


 





Also Read : కావాల్సినంత మెజార్టీ ఉన్నా అసంతృప్తి గండం.. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంగారు !


ఈ  అభివృద్ధి ప్రతిఫలం తెలంగాణకు లభిస్తోంది. సొంత పన్నులు, పన్నేతర ఆదాయం భారీగా పెరిగింది.  ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్‌ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగిందని తెలిపింది. 2014 -15తో పోల్చితే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం వృద్ధి నమోదు అయింది. పన్నుల ఆదాయం 2014-15లో రూ.29,288 కోట్లు ఉండగా 2020-21లో 85,300 కోట్లు వసూలయ్యాయి. అంటే ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నమాట. 


Also Read : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !


వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదయింది. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తెలంగాణ ఏడేళ్లలో నిర్మించింది. దీని వల్ల తెలంగాణలో భారీగా సంపద వృద్ధి చెందింది. వీటి కోసం తెలంగాణ సర్కార్ భారీగా అప్పులుకూడా చేసింది. 2015 మార్చి నాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు.. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. 


Also Read : వరి రైతులకు మద్దతుగా రెండు రోజులు టీ కాంగ్రెస్ దీక్ష.. కేసీఆర్ రైతు ద్రోహిగా తేల్చిన రేవంత్ !


ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం వృద్ధి చెందితే తెలంగాణ మాత్రం 22.2 శాతం  వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతూంటారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి నిజమేనని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 


Also Read : నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి