వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు శని, ఆదివారాలు ఇందిపార్క్‌లో ధర్నాచేయాలని నిర్ణయించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గాంధీ భవన్ లో కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు, టిఆర్ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షులు అభిలాశ్ రావ్ తన వందలాది మంది అనుచరులతో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.


Also Read : తెలంగాణ ఫార్మా రంగానికి "ఫ్లో కెమిస్ట్రీ" అడ్వాంటేజ్..! 


పాలమూర్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా మోసం చేసిన ద్రోహి కెసిఆర్ అని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఏ ఆడ్డా మీద చూసినా పాలమూరు బిడ్డలే  కూలీలుగా  ఉన్నారని.. పాలమూరు బిడ్డలు ఐఏఎస్ , ఐపీఎస్ లు కావద్దా.. బానిసలుగానే బ్రతకాలా అని రేవంత్ ప్రశ్నించారు. టీపీసీసీ పదవి తనకు ఇవ్వడం అంటే సోనియాగాందీ మన జిల్లాకు ఇచ్చిన గౌరవమని, నేను పాలమూరు బిడ్డని అని గర్వంగా  చెప్పుకుంటానని ఆయన అన్నారు.


Also Read : తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !


కాంగ్రెస్ పార్టీ మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిందని పూర్వ జిల్లాలో 14 అసెంబ్లీ , 2 పార్లమెంట్ లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి సోనియమ్మకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక్క కొల్లాపూర్ నే కాదు 14 అసెంబ్లీ , 2 పార్లమెంట్ లని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఎవరు ముఖ్యమంత్రి అయినా, పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ది చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు బిడ్డకి కాంగ్రెస్ లో అందరికి బీ ఫామ్స్ ఇచ్చే అవకాశం సోనియాగాంధీ ఇచ్చిందని ఇప్పటివరకు ఎవరెవరికో ఓట్లు వేశాం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కి వేద్దామన్నారు.


Also Read : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !  


వరి రైతులకి ఉరి అని కేసీఆర్ అంటున్నారని..  టిఆరెస్ , బీజేపీ కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయని ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చంపాడానికే టిఆరెస్ , బీజేపీ కలసి పని చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ , రైతు ద్రోహి కెసిఆర్ అని విమర్శించారు. కెసిఆర్ రెండోసారి సీఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మంది రైతులు చనిపోయారని ఇదా కేసీఆర్ తెలంగాణ రైతులకు చేస్తున్న సంక్షేమం అని ప్రశ్నించారు.డిల్లీలో చనిపోయిన రైతులకు మూడు లక్షలు ఇస్తానని కెసిఆర్ అంటున్నడని, మరి ఇక్కడ చనిపోయిన లక్ష మంది రైతులకి ఎం ఇవ్వరా .. ఇదేం న్యాయం అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  తెలంగాణ లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు సాధన కోసం  27 , 28 ఇందిరాపార్క్ లో వరి దీక్ష చేపడుతున్నమని.. వరి రైతుల కోసం రెండు రోజులు దీక్ష చేస్తామని  ప్రకటించారు. ఈ వరి దీక్షకి పెద్ద ఎతున్న రైతులు , కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. 


 


Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి