'శ్యామ్ సింగ రాయ్' టీజర్ చూశారా? చివర్లో నాని, కృతి శెట్టి మధ్య లిప్ లాక్ లాంటి ముద్దును చూపించారు. అదే ముద్దును 'ఏదో ఏదో...' లిరికల్ వీడియోలో మరోసారి చూపించారు. ఈ పాటను నాని, కృతిపై తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కోల్‌కతా నేపథ్యంలో తీసిన సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌లో నాని బెంగాలీ డైలాగ్స్ చెప్పారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో శ్యామ్ సింగ రాయ్ కోల్‌కతాలో ఉంటే... ప్రజెంట్ జనరేషన్‌లో హీరో హైదరాబాద్ బేస్డ్ యువకుడిగా కనిపించనున్నారని సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పాటలో కనిపించింది. సాంగ్ విషయానికి వస్తే... మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే. మేయర్ మార్క్ కనిపించింది. 'ఏదో ఏదో...' పాటను కృష్ణకాంత్ (కె.కె) రాయగా... చైతన్య అంబడిపూడి ఆలపించారు. లిరికల్ వీడియోస్ లో చూపించిన కొన్ని సీన్స్ రొమాంటిక్‌గా ఉన్నాయి. నాని, కృతి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఓ చిన్న ముద్దును చూపించి... ఆ తర్వాత కృతిని నాని దగ్గరకు తీసుకున్న తర్వాత సీన్ కట్ చేశారు. బహుశా... మరో ముద్దు పెట్టారేమో!?
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్'కు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కాకుండా సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read: రాజ'శేఖర్'... చేసేది చెప్పడు, చెప్పింది చేయడు! ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?
Also Read: కొవిడ్‌లో చాలా గోతులు తవ్వుకున్నాం... మళ్లీ థియేటర్లకు రావాలి! - సుప్రియ
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో కన్‌ఫ్యూజన్!
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి