'వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?' - ఇదీ శేఖర్ గురించి కొంత మంది(పోలీస్ డిపార్ట్మెంట్)లో ఉన్న అభిప్రాయం. శేఖర్... ఆయనో పోలీస్. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేశాడు. కానీ, అతడు వచ్చే వరకు జంట హత్యల కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఆసక్తి చూపించడు. ఎందుకు? శేఖర్ స్పెషాలిటీ ఏంటి? ఆయన ఏం చేశాడు? కేసును ఎలా డీల్ చేశాడు? అనేది తెలియాలంటే... 'శేఖర్' సినిమా వచ్చే వరకూ వెయిట్ చేయాలి.


రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'శేఖర్'. ఆయన 91వ చిత్రమిది. జీవితా రాజశేఖర్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. అది చూస్తే... అరకు నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్టు అర్థం అవుతోంది. అరకులోని బోసు గూడెంలో గల ఓ తోట బంగ్లాలో నూతన దంపతుల హత్య జరుగుతుంది. అక్కడకు వచ్చిన శేఖర్ కేసును ఎలా డీల్ చేశాడనేది కథగా తెలుస్తోంది. అలాగే, శేఖర్ తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడన్నది కూడా ఆసక్తికరమే. ఫ‌స్ట్ గ్లింప్స్‌లో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్ట‌యిలిష్‌గా ఉన్నారు.





పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?
Also Read: కొవిడ్‌లో చాలా గోతులు త‌వ్వుకున్నాం... మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రావాలి! - సుప్రియ
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో క‌న్‌ఫ్యూజ‌న్‌!
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి