ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వరి ధాన్యం లారీలు వరుసగా నిలబడిపోయాయి. తెలంగాణలోకి రావడానికి పోలీసులు అంగీకరించడం లేదు. ధాన్యం లారీలకు నేషనల్ పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశించినందున ఆపేస్తున్నట్లుగా డ్రైవర్లకు అధికారులు చెబుతున్నారు. వరి ధాన్యం లోడుతో వస్తున్న లారీలను మాత్రమే నిలిపివేస్తున్నారు. గురువారం నుంచి కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు కర్నూలు శివారులోని పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆపేశారు. దీంతో వరి ధాన్యం లారీ లోడ్లు జాతీయ రహదారిపై నిలిచి పోయాయి.


Also Read : నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!


పోలీసులు నిలిపివేయడంతో  లారీల్లో ధాన్యం తెస్తున్న రైతులు, లారీ డ్రైవర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాంటి ప్రకటన లేకుండా ఎలా ఆపేస్తారని లారీ డ్రైవర్ లు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఏపి నుంచి వచ్చే వరి ధాన్యంను కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ సియం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణ మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యం కొంటున్నారు. వారు తెలంగాణ రైతుల ధాన్యం కొనడం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు ! 


ప్రస్తుతం తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై రాజకీయం ఎక్కువగా ఉంది. తెలంగాణ సర్కార్ వరి ధాన్యం కొనాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరో వైపు రైతులు కూడా పెద్ద ఎత్తున తమ ధాన్యం అమ్ముకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ధాన్యం వస్తే తెలంగాణ రైతులకు ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతో వాటిని నిలిపివేసినట్లుగా భావిస్తున్నారు.


Also Read : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?


గతంలో ఓ సారి ఏపీ సరిహద్దుల్లో ఇలాగే అంబులెన్స్‌లను నిలిపివేశారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తెలంగాణ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏపీ నుంచి వస్తున్న రోగుల వల్లేనని భావించి అధికారులు అంబులెన్స్‌లను నిలిపివేశారు. న్యాయస్థానం ఆదేశాలతో తర్వాత అనుమతించారు. ఇప్పుడు మరోసారి వరి ధాన్యం విషయంలో అలాంటి సమస్యలే వస్తున్నాయి. 


Also Read : 10 లక్షల ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చాం.. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి