ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం పేదలకు వైద్యం అందిస్తుందని ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన వైద్యంపై మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల్లోని 130 సూపర్ స్పెషాలిటీల్లో ఆరోగ్య శ్రీ వర్తింపజేశామని సీఎం జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ లాంటి చికిత్సలు కూడా అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రూ. 4వేల కోట్ల రూపాయలను 29 నెలల కాలంలో ఖర్చు చేశామన్నారు. అంతేగాకుండా కిందటి ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించినట్టు సీఎం జగన్ తెలిపారు. 21 రోజుల్లో నెట్‌వర్క్‌ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామని కూడా చెప్పారు.


'ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. గ్రామస్థాయి నుంచి సమూల మార్పులు తీసుకొస్తాం. నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. రూ.16,255 కోట్లలో ఆస్పత్రుల్లో నాడు-నేడు అమలు చేస్తున్నాం. ఆరోగ్య శాఖలో 9712 పోస్టులు భర్తీ చేశాం. 14788 పోస్టులు వచ్చే ఫిబ్రవరిలోగా భర్తీ చేస్తామని చెబుతున్నాను. 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్స్‌ ఏర్పాటు చేశాం. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకువస్తాం. వచ్చే 6 నెలల్లో వైద్య సంస్కరణలు అమల్లోకి వస్తాయి.' అని సీఎం జగన్‌ తెలిపారు.






వైద్యం ఖర్చు వెయి రూపాయలు దాటితే.. ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చాం. గతంతో పోలిస్తే చికిత్సలు రెట్టింపు చేశాం ఇంకా ఏదైనా అవసరం ఉంటే.. కొత్తగా చేరుస్తాం.  కిందటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. గిరిజన ప్రాంతంలో కొత్తగా టీచింగ్‌ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. ప్రతీ పార్లమెంట్‌ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేలా ప్రణాళికలు చేస్తున్నాం.
                                                                          - వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి


Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !


Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !


Also Read: TDP Jr NTR : జూ. ఎన్టీఆర్ ప్రకటనపై టీడీపీలో అసంతృప్తి .. ఘాటుగా స్పందించలేదని విమర్శలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి