తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన టీడీపీ నేతలకు నచ్చలేదు. టీడీపీ నేత వర్ల రామయ్య భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పన్నెండుగంటల పాటు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. మేనత్తను దారుణంగా తిట్టినా ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని విమర్శించారు. కష్ట కాలంలో అండగా ఉన్న వారే పార్టీ సభ్యులు ఉన్నారు.  


Also Read : నిమిషాల్లో విరుచుకుపడిన ప్రళయం ! పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల విలయం ఎలా జరిగిందంటే ?


అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఉందని ఈ కారణంగా ఎన్టీఆర్ పద్దతిగా స్పందించారని వస్తున్న  వాదనలపైనా వర్ల రామయ్య స్పందించారు. అందరికీ సినిమాలు ఉంటాయని బాలకృష్ణకు లేవా అని ప్రశ్నించారు. బాలకృష్ణ ఎలా స్పందించారో చూడాలన్నారు.  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా అలాగే స్పందించారు. ఎన్టీఆర్ స్పందన ఆది, సింహాద్రిలా ఉంటుందనుకుంటే ప్రవచనాలు చెప్పారని మండిపడ్డారు. 


Also Read : ఆ 60 మందివి ప్రభుత్వ హత్యలే, ఆ ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం.. చంద్రబాబు వ్యాఖ్యలు


చంద్రబాబు సతీమణిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవడంతో వెకేషన్ కోసం ఎన్టీఆర్ యూరప్ టూర్‌కు వెళ్లారు. ఆయన కూడా అక్కడ్నుంచే వీడియో విడుదల చేశారు. అయితే ఆయన ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. దీంతో ఆయన సూక్తులు చెప్పారన్న అభిప్రాయం వినిపించింది. టీడీపీ నేతలకు ఈ స్పందన నచ్చలేదు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు నేరుగా విమర్శలు చేస్తున్నారు. 


Also Read : చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సంఘటన... లేచి నిలబడి నమస్కారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి


చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు. వారు పార్టీలోకి వచ్చిన తర్వాత  జూ.ఎన్టీఆర్ ఒత్తిడితోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి పార్టీ టిక్కెట్లు ఇచ్చారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వారు దారుణంగా తిడుతున్నందున ఎన్టీఆర్ ఘాటుగా  స్పందించాలన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ మాత్రం వీలైనంత సైలెన్స్ పాటిస్తున్నారు.  


Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి