మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. అయితే 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2వ తేదీ వరకు శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.


Also Read : క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అలియాస్‌ దొండ్లవాగు శంకర్‌రెడ్డి పేరు ఉంది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్‌సీపీ తరపున పులివెందుల పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. 


Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..


దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చిన తర్వాత శివశంకర్‌రెడ్డిని సీబీఐ నవంబరు 17వ తేదీన హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది.  వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.  దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ సమాచారం ఇచ్చిన హాజరు కాలేదు. దాంతో సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో ఆయనను పట్టుకుంది. కడపకు తరలించింది. పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచింది. 


Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?


ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.  దీంతో కస్టడీలో శివశంకర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు లాగుతారన్నది ఆసక్తికరంగా మారింది. 


Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి