Morning Top News:
నేడు తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష
తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌తో శనివారం ఉదయం విడుదలై ఇంటికి చేరుకున్న అనంతరం.. ఆయన ఇల్లు సెలబ్రిటీలతో సందడి సందడిగా మారింది. ఇంటికి రాలేని వారు ఫోన్ చేసి మరీ బన్నీకి సంఘీభావం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం అల్లు అర్జున్‌కు కాల్ చేసి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్టార్ హీరోలైన బాలయ్య, ప్రభాస్, తారక్‌లు అల్లు అర్జున్‌కు కాల్ చేసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి దుర్మరణం
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకి చెందిన ఓ యువతి మృతి చెందారు. తెనాలి కి చెందిన నాగశ్రీవందన పరిమళ .. ఎంఎస్ చేసేందుకు 2022, డిసెంబరులో అమెరికా వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలపాలై మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
శబరిమలకు భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ - కొల్లాం, కాకినాడ - కొల్లాం వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా మరిన్ని అదనపు రైళ్లను నడపనున్నట్టు శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎస్సై ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న వాజేడు ఎస్సై హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వెంకటాపురం సీఐ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితురాలి అరెస్టును వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ
అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాత ఏం జరిగినా ఓ రకమైన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. దానికి సాక్ష్యంగా జూబ్లిహిల్స్ లోని నందదమూరి బాలకృష్ణ నివాసానికి గ్రేటర్ అధికారులు వేసిన మార్కింగ్ ను చూపిస్తున్నారు.ఆయన ఇల్లును కూల్చేయబోతున్నారని రోడ్ వైడెనింగ్ లో భాగంగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారని అంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగాన భారతదేశం
డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.పూజా కార్యక్రమం అనంతరం ఆలయం నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగాన భారతదేశం, దేశంలో అగ్రభాగాన ఏపీ ఉండబోతున్నాయి అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కాంగ్రెస్ పార్టీ చరిత్రను తవ్వి కడిగిపారేసిన ప్రధాని మోదీ
రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చడమే కాదు , ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాల రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని ప్రధాని మోదీ విమర్శించారు. లోక్ సభలో మోదీ ప్రసంగించారు. ఎంతో మంది పెద్దలు అలా చేయవద్దని సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సవరణలు చేశారని గుర్తు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గుకేష్‌పై ఇంత వివక్షా
ప్రపంచ చదరంగ చరిత్రలో భారత్‌కు చందిన దొమ్మరాజు గుకేష్ చరిత్ర సృష్టించారు. మన దేశంలో అందరూ అభినందిస్తున్నారు కానీ.. విదేశాల్లో మాత్రం గుకేష్ విజయాన్ని భరించలేకపోతున్నారు. అత్యంత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వరల్డ్ చెస్ చాంపియన్ గా సాంబార్ వ్యక్తి గెలిచాడంటూ.. .సింగపూర్ పత్రిక రాసిన కథనం తీవ్ర సంచలనం అయింది. అది ఖచ్చితంగా వివక్ష చూపించడమేనన్న అభిప్రాయం వ్యక్తమయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లలో ఒకే ఒక్క హిందువు
పాకిస్తాన్ లో హిందువులపై దాడులు గురించి తరచూ వార్తలు వస్తూంటారు. కానీ పాకిస్తాన్ పోలీసులలో ఒక హిందువు ఉన్నాడని మీకు తెలుసా. మనకు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉన్నట్లుగా పాకిస్తాన్‌లోనూ పోలీస్ సర్వీస్ ఉంది . ఇప్పటి వరకూ అందులో ఒకే ఒక్క హిందువు ఉన్నాడు. అతనే రాజేందర్. అతి తక్కువ శాతం ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువుల్ని కాస్త గౌరవంగా చూసి రిజర్వేషన్లు కూడా ఇవ్వని పాకిస్తాన్ లో మెజార్టీతో పోటీ పడి పరీక్షలు రాసి రాజేందర్ మేఘ్‌వార్ పోలీస్ ఆఫీసర్‌గా పోస్టు దక్కించుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..