Pakistan first Hindu police officer and protests in Pakistan occupied Kashmir:  రాజేందర్ మేఘవార్ అంటే ఫైసలాబాద్‌లో అందరికీ హడల్. ఈ ఫైసలాబాద్ మన యూపీలో లేదు. పంజాబ్‌లో లేదు. కశ్మీర్‌లో ఉంది. ఆ కశ్మీర్ ఇటీవల మన కశ్మీర్ కాదు.  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది.  పాకిస్తాన్ లోని పైసలాబాద్‌కు చెందిన రాజేందర్ మేఘవార్ అక్కడ ఇప్పుడు సిన్సియర్ పోలీసు ఆఫీసర్. 


పాకిస్థాన్‌లో రెండు శాతం హిందువులు 


దేశ విభజన సమయంలో మన దేశంలో ముస్లింలు అందరూ పాకిస్తాన్ కు వెళ్లాలనుకోలేదు. అయితే పాకిస్తాన్ లో ఉన్న దాదాపుగా హిందువులంతా ఇండియాకు వచ్చేశారు. కానీ రాలేకపోయినా కొంత మంది మాత్రం పాకిస్తాన్ పౌరులుగా ఉండిపోయారు. అలా ఉండిపోయిన హిందువులు  రెండు శాతం ఉంటారు.వీరు వివక్షకు గురైనా తమ దేశం పాకిస్తాన్ అని నరనరాల దేశభక్తిని నింపుకుని అక్కడే ఉంటున్నారు. అయితే వారిని అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూంటారు. హక్కులు కూడా పెద్దగా కల్పించరు. అయినా వివక్షను ఎదుర్కొంటూ కొంత మంది పోరాడుతూనే ఉంటారు. 


Also Read: ట్రంప్ వైట్‌హౌస్‌లోకి వెళ్లగానే భారత్‌కు ప్రత్యేక విమానాలు - 18 వేల మంది ఇండియన్స్‌ను గెంటేస్తారట!


ఇప్పటి వరకూ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేరు 


అతి తక్కువ శాతం ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువుల్ని కాస్త గౌరవంగా చూసి రిజర్వేషన్లు ఇవ్వడం లాంటివి ఎప్పుడూ చేయలేదు. అయితే మెజార్టీతో పోటీ పడి పరీక్షలు రాసి  రాజేందర్ మేఘ్‌వార్ పోలీస్ ఆఫీసర్‌గా పోస్టు  దక్కించుకున్నారు. పాకిస్తాన్ ఏర్పడి ఏడు దశాబ్దాలు అవుతున్న..ఇప్పటి వరకూ అలాంటి పోలీస్ అపీసర్ పోస్టుల్లోకి ఒక్క హిందువు కూడా రాలేదని రికార్డులు చెబుతున్నాయి. మొదటి సారి రాజేందర్ మేఘవార్ వచ్చారు. ఆయన కూడా సిన్సియర్ గా పోలీస్ పని చేస్తూ తన ఎంపిక సరైనదేనని నిరూపిస్తున్నారు. 


Also Read:  ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో


పీవోకే సమర్థమైన అధికారిగా రాజేందర్ మేఘవార్ 


పాకిస్తాన్‌లో ఎప్పుడూ అల్ల కల్లోల పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఇంకా ఎక్కువ. అక్కడి ప్రజలు ప్రభుత్వ వివక్షపై ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. విద్యుత్ సరిగ్గా ఇవ్వాలని, తక్కువ ధరకు ఇవ్వాలని..  గోధుమపిండిని సబ్సిడీ ధరలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి రాజేంద్ర మేఘవార్ లాంటి అధికారులు అవసరమని ఆయనను నియమించారు.                                                


పాకిస్తాన్ లో హిందువులపై దాడులు గురించి తరచూ వార్తలు వస్తూంటారు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో కూడాచకొంత కాలం కిందట ఓ హిందూ క్రికెటర్ ఉన్నారు. ఆయన పేరు దానేష్ కనేరియా. తన పై టీమ్‌లో ఎంతో వివక్ష చూపించేవారు ఆయన పలుమార్లు బాధపడ్డారు కూడా.