Revanth Reddy Next Target Balakrishna : అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాత ఏం జరిగినా ఓ రకమైన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్   నందమూరి బాలకృష్ణ అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. దానికి సాక్ష్యంగా జూబ్లిహిల్స్ లోని నందదమూరి బాలకృష్ణ నివాసానికి గ్రేటర్ అధికారులు వేసిన మార్కింగ్ ను చూపిస్తున్నారు.ఆయన ఇల్లును కూల్చేయబోతున్నారని రోడ్ వైడెనింగ్ లో భాగంగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారని అంటున్నారు. 


కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం         


నందమూరి బాలకృష్ణ నివాసం కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ కు ఎదురుగా ఉంటుంది. అది జూబ్లిహిల్స్ చెక్ పోస్టుకు సమీపంలో ఉంటుంది. ఆ నివాసాన్ని చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. సుదీర్ఘకాలంగా బాలకృష్ణ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెరిగిపోయిన ట్రాపిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేబీఆర్ పార్క్ చుట్టూ  ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించుకకుంది. అలాగే రోడ్డు విస్తరణను చేపట్టాలని డిసైడయింది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. 


అందులో భాగంగానే  బాలకృష్ణ ఇంటికి మార్కింగ్          


అయితే రోడ్డు విస్తరణ, ప్లైఓవర్లు నిర్మించాలని అక్కడ ఉన్న ఇళ్లు, వ్యాపారసంస్థల భవనాల నుంచి ఖచ్చితంగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే రోడ్డు విస్తరణకు అవసరమైన చోట ఎక్కడెక్కడ భూసేకరణ చేయాలో అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్లాన్ రెడీ అయినందున ఇళ్ల దగ్గర ఈ మార్కింగ్ జరుగుతోంది. ఎంత మేర అవసరం అవుతుందో నోటీసులు జారీ చేస్తారు. వారి అనుమతితోనే .. చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూమిని సేకరిస్తారు. ఇల్లు మొత్తం తీసేయడం ఉండదని.. రోడ్డుకు అవసరమైనంత తీసుకుంటారని చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న భవనాలకు..ఈ నోటీసులు అందుతున్నాయి. 



Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?




అయితే ఇదేమీ కొత్తది కాదని..  బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే ఈ అంశంపై వార్తలు వచ్చాయి. బాలకృష్ణకు చెందిన ఒక్క ఇల్లే టార్గెటెడ్ గా తీసుకోవడం లేదని.. కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ కోసమే తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ అంశంపై బాలకృష్ణ కూడా ఎప్పుడో అంగీకారం తెలిపారని  చెబుతున్నారు.  భూమి ఇచ్చినందుకు పరిహారంతో పాటు ప్రస్తుతం ఉన్న ఇంట్లో రోడ్డు వరకూ పోను మిగిలిన స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి బాలకృష్ణ ప్లాన్ చేసుకున్నారని కూడా గతంలో ప్రచారం జరిగింది. 


అయితే ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో  బాలకృష్ణను టార్గెట్ చేశారన్న ప్రచారాన్ని చేస్తున్నారని అంటున్నారు. 



Also Read: Jamili Elections: 2029 కూడా కాదు పూర్తి స్థాయి జమిలీ 2034లోనే - బిల్లులో బయటకు రాని సంచలన విషయం ఇదే!