Top News Today: 

1. దివికేగిన రతన్ టాటా

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా  (86) కన్నుమూశారు. టాటా గ్రూప్‌ ప్రస్థానంలో రతన్‌ టాటా  కృషి అసామన్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు గడించిన రతన్‌ టాటా.. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఏ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగారు. ఎంతో వినయంగా... ప్రచారాలకు, ఆర్భాటాలకు దూరంగా.. సాధారణ జీవనశైలితో ఉండటానికి టాటా ఇష్టపడతారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. రతన్ టాటాకు లభించిన పురస్కారాలు

నావల్‌ టాటా-సోనీ టాటా దంపతులకు 1937 డిసెంబర్‌ 28న రతన్‌ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఆయన ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌, 2008లో రెండో అత్యున్న పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

3. రతన్ టాటా మృతి.. మోదీ సహా ప్రముఖుల సంతాపం. 

రతన్ టాటా మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ‘X’లో పోస్ట్ పెట్టారు. ‘‘ రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎందరికో ఆయన ఆప్తుడయ్యారు.’’ అని ఎక్స్‌లో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన మంచిని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ‘ రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి. వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ శాశ్వతమైన ముద్ర వేశారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి నా ప్రగాఢ సానుభూతి’’ అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

4. 100 దేశాల్లో టాటా కంపెనీలు

రతన్ టాటా 1962లో టాటా స్టీల్‌లో పనిచేస్తూ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1970లో టాటా కార్పొరేషన్‌ బాధ్యతలు చేపట్టారు. 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో కంపెనీ గ్రూపు ఆదాయాలు 40 రెట్లు పెరిగాయి. వ్యాపారాన్ని ప్రపంచీకరణ చేసే లక్ష్యంతో టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేసింది. 100దేశాలకు పైగా టాటా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. విశాఖలో TCS

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ నగరానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్టు వెల్లడించారు. ఈ కంపెనీ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి కానుందని లోకేశ్ తెలిపారు. రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్టు లోకేశ్ మంగళవారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 

 

6. మాట నిలబెట్టుకున్న పవన్‌ కల్యాణ్

అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి పాఠశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లిన ఆయనకు పలువురు స్కూల్‌కి ఆటస్థలం లేదని చెప్పారు. దీంతో తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు ఆయన అందజేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకేనా.. జగన్ ట్వీట్ వైరల్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారు. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిది’ అని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

8. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పేదల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని  2028 డిసెంబర్‌ వరకు పొడిగించారు.కేంద్రం వందశాతం నిధులతో పోషకాహారం అందించేందుకు ఫ్టోర్టిఫైడ్‌ రైస్‌ని సరఫరా చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

9. మహిళల టీ20 వరల్డ్‌కప్.. భారత్ ఘన విజయం

మహిళల T20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై భారత్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌట్‌ అయింది. అరుంధతీ రెడ్డి 3, ఆశా శోభన 3, రేణుకా సింగ్‌ 2, శ్రేయాంక పాటిల్‌, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ తీయగా.. మంధన (50), హర్మన్‌ప్రీత్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

 

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 9 వికెట్ల నష్టానికి 135 రన్స్‌ మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా 41 టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్, నితీష్ చెరో 2, అర్ష్‌దీప్, సుందర్, అభిషేక్, మయాంక్, రియాన్ తలో ఒక వికెట్ తీశారు. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..