Ratan Tata Death: ఓ వ్యాపారి ఆలోచనా తీరు సాధారణంగా ఎలా ఉంటుంది. తనకు లాభాలు రావాలి. తన సంస్థ బాగుపడాలనే కోరుకుంటారు. అందులో పెద్దగా తప్పుపట్టాల్సిందేమీ లేదు కానీ రతన్ టాటా లాంటి వాళ్ల ఆలోచనా విధానమే వేరుగా ఉంటుంది. మన దేశంలో కొత్త ఐడియాలతో వ్యాపారం చేయటానికి ఎవరైనా యువకులు ముందుకు వస్తే వారికి సాయం చేస్తే దేశ స్వరూపమే మారిపోతుందని ఆలోచిస్తారు. అలాంటి ఐడియాలు నచ్చితే రతన్ టాటా వాళ్ల సంస్థలో పెట్టుబడి పెట్టేస్తారు. వాళ్లు ఆ డబ్బుతో వ్యాపారం చేసి.. అది పెద్ద సంస్థగా మారితే ఆ సంస్థ మరో వందమందికి ఉపాధి కల్పిస్తుంది ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అనేది టాటా ఆలోచన. అసలు ఆయన డబ్బులు పెట్టడం కాదు తన ఆలోచన వెనుక రతన్ టాటా ఉన్నారు అన్న బ్రాండ్ ఆ పేరు చాలు ఆ స్టార్టప్ దశ మారిపోయినట్లే.
40కుపైగా సంస్థల్లో పెట్టుబడి
అలా తన జీవితంలో ఇటీవలి కాలంలో 40 అంకుర సంస్థలకు మద్దతుగా నిలిచి ప్రాణం పోశారు రతన్ టాటా. ఇప్పుడు చెప్పే పేర్లు మీరు రోజూ వింటున్నవే..కానీ అవి చిన్న మొక్కగా స్టార్ట్ అయినప్పుడే రతన్ టాటా వాటికి అండగా నిలిచారు. ప్రముఖ ఈ స్కూటర్ల తయారీ సంస్థ ఓలాకు పెట్టుబడిదారు రతన్ టాటానే. కళ్లజోళ్లకు తయారీకి సంబంధించి ఆన్ లైన్ లో ప్రముఖ మార్కెటింగ్ సంస్థగా ఎదిగిన లెన్స్ కార్ట్...మెట్రో, టైర్ 1 టైర్ 2 సిటీస్‌లో ప్రముఖ సర్వీసెస్ కంపెనీగా ఎదిగిన అర్బన్ కంపెనీ, ప్రముఖ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం, స్టాక్స్ మీద పనిచేసే అప్ స్టాక్, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ 40 కంపెనీలంత ఉంది. ఈ కంపెనీలన్నింటికీ తొలి రోజుల్లో కొండంతా అండగా నిలబడి ఈ రోజు కంపెనీలు మార్కెట్లో దూసుకువెళ్లటానికి వాళ్లంతా వ్యాపారవేత్తలుగా మారి మరో పందిమందికి ఉపాధి కల్పించటానికి కారణమయ్యారు రతన్ టాటా
మధ్యతరగతి మంత్రదండం
అంతేకాకుండా మధ్యతరగతి మనిషి పడే ఈ ఆవేదనను వీలైనంత తీర్చాలని ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా. దాని కోసం ఆయన వ్యాపారాన్నే ఓ మార్గంగా మలిచారు. టాటాల వస్తువులన్నీ వీలైనంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉండేలా చేశారు. ఈరోజు మనం చూసే వ్యాపార సంస్థలు క్రోమా లాంటి వస్తువులు అమ్మే దుకాణాలు అయినా.. జూడియో లాంటి వస్త్రదుకాణాలైనా..టాటా ఇండికా లాంటి కార్లైనా.. ఆయన దృష్టి మధ్యతరగతిపైనే ఉంటుంది.
నానోతో సంచలనం
అంతెందుకు ప్రపంచంలోనే ఏ పారిశ్రామికవేత్త ఆలోచించిన విధంగా లక్ష రూపాయలకే ప్రజలకు కారును అందించాలని చేసిన టాటా నానో కార్ల ప్రయోగమైనా టాటా ఏం చేసినా మిడిల్ క్లాస్ పీపుల్ బాగుపడాలి. మనం చేసే వ్యాపారం కేవలం వ్యాపారం మాత్రమే కాక దేశంలో ఆ సెక్షన్ పీపుల్ ఎంపవరమెంట్‌కి ఉపయోగపడాలి అని ప్లాన్ చేసేవారు. అందుకే టాటా సంస్థలు విశ్వసనీయత చిరునామాగా నిలవటంతోపాటు మరే సంస్థ దక్కించుకోని మధ్యతరగతి ప్రజాదరణను పొందగలిగాయి. అందుకే రతన్ టాటా మృతితో యావత్ భారతావని విషాదంలో మునిగిపోయింది.
Also Read: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం