Daily Horoscope for 10th October 2024
మేష రాశి
దుర్గాష్టమి మేషరాశివారికి మంచి రోజు అవుతుంది. కొత్తగా ప్రారంభించే పనులన్నీ సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఇదే మంచి సమయం. అప్పులు చేయాల్సి రావొచ్చు జాగ్రత్త పడండి.
వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది..అనుకోని ఆదాయం చేతికందుతుంది. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాల గురించి చర్చించవద్దు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. నూతన పెట్టుబుడులు పెట్టే ఆలోచన ఉంటే అడుగు ముందుకు వేయండి.
మిథున రాశి
ఈ రాశివారు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సహనంతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోతారు. మీ మాటతీరుపై నియంత్రణ కొనసాగించండి. మీ పురోగతికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనితీరుకి అవార్డులు వస్తాయి. మీ మనసులో ఉండే గందరగోళాన్ని పరిష్కరించుకోవడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ శత్రువులు ఉత్సాహంగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ తెలివితేటలతో కొన్ని సమస్యలను అధిగమించి అడుగు ముందుకు వేస్తారు.
కన్యా రాశి
దుర్గాష్టమి రోజు మీకు మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు సమన్వయంతో పనిచేయడం ఉత్తమం. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలి. కుటుంబంలో వ్యక్తులు మీ మాటకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారులు చిన్న చిన్న లాభాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత స్నేహితులను కలుస్తారు.
తులా రాశి
ఈ రాశివారు అలవాట్లపై నియంత్రణను కొనసాగించాలి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులుంటాయి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. మీ మాటలో సౌమ్యత మీకు గౌరవాన్ని పెంచుతుంది. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజు చట్టపరమైన విషయాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ పని గురించి ఆందోళన చెందుతారు. అధిక పని కారణంగా, అలసిపోతారు. తలనొప్పి పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని అనవసర విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. కొన్ని పనుల విషయంలో టెన్షన్ ఉండవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు దుర్గాష్టమి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఏ పనిలోనూ తొందరపడకూడదు. అనవసర వాగ్ధానాలు చేయకుండా ఉండడం మంచిది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు.
మకర రాశి
ఈ రోజు మీరు నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు మంచి రోజు అవుతుంది. ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీకు కొంత అశాంతిగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అనవసర చర్చల్లో పాల్గొనకుండా ఉండాలి. సాధ్యమైనంతవరకూ మౌనం వహించడం మంచిది. అనుకున్న పనిని సకారంలో పూర్తిచేయకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు పొందలేరు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రోజంతా బిజీగా ఉంటారు. చాలా రోజులుగా ఉన్న కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.
Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.