Ratan Tata Recognitions List | రతన్ నవల్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనుమడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం చేశారు. అదే విధంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఆయన 1961 లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో కంపెనీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగిన రతన్ టాటా 1991 లో జె.ఆర్.డి టాటా అనంతరం టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు టాటా సన్స్ గ్రూపును ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమంగా నడిపించారు. సాఫ్ట్ వేర్ రంగంలోనూ లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. 2012లో రతన్ టాటా చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగారు.


సిరస్ మిస్ట్రీ 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్ గా కొనసాగారు. అనంతరం కొంతకాలం పాటు టాటా గ్రూపునకు తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా బాధ్యలు నిర్వర్తించారు. 2017లో ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. సామాన్య ప్రజలకు సొంత కారు కలను నెరవేర్చిన వ్యాపార చాణక్యుడు రతన్ టాటా. 2009లో నానోను (Nano Car)ను కేవలం లక్ష రూపాయల ఖర్చుతో రతన్‌ టాటా విడుదల చేశారు. ఇందుకోసం ఆయన తీవ్రంగానే శ్రమించారని చెప్పవచ్చు.


రతన్ టాటాకు అవార్డులు, సత్కారాలు



  • రతన్ టాటా చేసిన విశేష సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్ తో గౌరవించింది. 

  • మహారాష్ట్ర ప్రభుత్వం 2006లో మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది.

  • 2008లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ తో రతన్ టాటాను సత్కరించారు.

  • 2014లో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు

  • 2021లో అస్సాం వైభవ్ తో రతన్ టాటాను సన్మానించారు

  • 2023లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు




  • 2004లో మెడల్ ఆఫ్ ద ఒరియెంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పురస్కారం

  • 2007లో కార్నేజ్ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రపీ అవార్డు

  • 2008లో సింగపూర్ ప్రభుత్వం నుంచి హానరరీ సిటిజన్ అవార్డ్

  • 2009లో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ అవార్డ్

  • 2009లో ఇటలీ నుంచి గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ అని ఆ దేశ అత్యున్నత పురస్కారం
    2010లో యేల్ యూనివర్సిటీ నుంచి లెజెండ్ ఇన్ లీడర్ షిప్ అవార్డ్

  • 2012లో జపాన్ ప్రభుత్వం నుంచి గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ పురస్కారం

  • రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

  • 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కమాండర్ ఆఫ్ లిజియన్ ఆఫ్ ద హానర్

  • 2023 మహారాష్ట్ర ఉద్యోగరత్న


వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలు, దేశాల నుంచి గౌరవ డాక్టరేట్ ను రతన్ టాటా అందుకున్నారని తెలిసిందే.


Also Read: Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం