Ratan Tata In Critical Condition At Mumbai Hospital | ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ వివరాలు వెల్లడించారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న రతన్ టాటా తన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ప్రచారం చేయవద్దని సైతం సూచించారు. కాగా, మరోసారి టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. రతన్‌ టాటా సోమవారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లడం మాత్రం నిజం.


రతన్ టాటా ఆరోగ్యం విషమం..


తాజా ప్రచారం అవుతున్న రిపోర్ట్ ప్రకారం.. రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం రతన్ టాటా వయసు 86 ఏళ్లు కాగా, ఆయన వయసురీత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు రతన్ టాటా ముంబైలోని హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వదంతులు ప్రచారమయ్యాయి. రెగ్యూలర్ మెడికల్ హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వెళ్లినట్లు రతన్ టాటా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వదంతులకు చెక్ పెట్టారు.


రతన్ టాటా 1991లో టాటా గ్రూపు ఛైర్మన్ అయ్యారు. టాటా గ్రూపును రతన్ టాటా ముత్తాత జంషేడ్ జి టాటా దాదాపు వంద ఏళ్ల కిందట స్థాపించారు. మూడు దశాబ్దాల పాటు సేవలు అందించిన రతన్ టాటా 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రతన్ టాటా  1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు తీసుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ గా తప్పుకున్న అనంతరం టాటా సన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్‌కు ఎమెరిటస్ ఛైర్మన్ ఆఫ్ టాటా సన్స్ అను హోదాతో వ్యవహరిస్తున్నారు. 


Also Read: Maya Tata: రూ.20 లక్షల కోట్ల టాటా సామ్రాజ్యం! వారసురాలిగా ఆమెకే పట్టం!!