Janaka Aithe Ganaka OTT Platform Telugu And Release Date: వెర్సటైల్ యాక్టర్ సుహాస్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'జనక అయితే గనక'. 'దిల్' రాజు ప్రొడక్షన్స్ పతాకం మీద శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన సినిమా కావడం... గతంలో 'బలగం' వంటి హిట్ చిత్రాన్ని నిర్మించి ఉండటం... 'దిల్' రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న కంటెంట్ బేస్డ్ సినిమా కావడం... పాజిటివ్ విషయాలు చాలా ఉన్నాయి కనుక 'జనక అయితే గనక' మీద ప్రేక్షకులు చూపు పడింది. అన్నట్టు... ఈ సినిమా ఏ ఓటీటీ వేదికలో విడుదల అవుతుందో తెలుసా?


ఆహా... జనక అయితే...
మీకు అర్థం అవుతోందా?
Janaka Aithe Ganaka Release Date: విజయ దశమి సందర్భంగా ఈ నెల 12న (శుక్రవారం నాడు) ప్రేక్షకుల ముందుకు 'జనక అయితే గనక' సినిమా వస్తోంది. అయితే... వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కంటే రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. పండక్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడం ఖాయంగా కనబడుతోంది. అయితే... ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ఓటీటీ వేదిక ఏదో తెలుసా?


Janaka Aithe Ganaka Digital Streaming Platform: 'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 100% తెలుగు ఓటీటీ 'ఆహా' సొంతం చేసుకుంది. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి అంటే ముందు ఓటీటీ రైట్స్ 'ఆహా'కు ఇచ్చేసింది 'దిల్' రాజు కాంపౌండ్. థియేటర్లలో స్పందన బట్టి ఓటీటీ విడుదల తేదీ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?



ప్రభాస్ 'సలార్' రచయిత దర్శకుడిగా...
'జనక అయితే గనక' చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్: పార్ట్ 1' చిత్రానికి ఆయన మాటల రచయితగా పని చేశారు. అది ఫక్తు కమర్షియల్ సినిమా అయితే... 'జనక అయితే గనక' చక్కటి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. కుటుంబ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో కాన్సెప్ట్ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులతో పాటు చిత్ర బృందం కూడా చెబుతోంది.


Also Read: నెట్‌ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న పవన్ కల్యాణ్ 'ఓజీ' విలన్!



'జనక అయితే గనక' చిత్రానికి విజయ బుల్గానిన్ సంగీత‌ దర్శకుడు. సినిమా విడుదలకు ముందు ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులలోకి వెళ్లాయి. ట్రైలర్లకు తోడు పాటలు కూడా సినిమా మీద బజ్ పెంచాయి. ఈ సినిమాలో సుహాస్ సరసన సంగీర్తన కథానాయికగా నటించగా... ఇతర కీలక పాత్రలలో మురళీ శర్మ, గోపరాజు రమణ, 'వెన్నెల' కిషోర్, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుంచి 'జనక అయితే గనక' చిత్రానికి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.