'Devara' Nyayam in  Mahabharatham:  శంతనమహారాజు ఓరోజు వేటకు వెళ్లి మత్స్యకన్య సత్యవతిని చూసి మోహిస్తాడు. వివాహం చేసుకుంటానని అడిగితే తన కడుపున పుట్టే బిడ్డలే రాజ్యపాలన చేయాలనే షరతు విధిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శంతనమహారాజు తనయుడు (గంగాదేవి పుత్రుడు) భీష్ముడు..తాను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత శంతనుడికి వివాహంచేసుకుంటుంది సత్యవతి.


సత్యవతీ, శంతనమహారాజుకి... చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు. శంతనుడి మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఓ గంధర్వుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత విచిత్ర వీర్యుడు రాజయ్యాడు..తన భార్యలే అంబిక, అంబాలిక. విలాసాలతో కాలం గడుపుతూ కొద్దికాలానికే అనారోగ్యంతో మరణించాడు విచిత్రవీర్యుడు. 


రాజ్యానికి, వంశపరిరక్షణకు వేరే మార్గంలేక భీష్ముడిని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది. కానీ తాను చేసిన ప్రతిజ్ఞను వీడిది లేదని నిరాకరించాడు భీష్ముడు. అదే సమయంలో దేవర న్యాయం గురించి భీష్ముజడు వివరించాడు


పెద్దల అనుమతితో...ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్లకు ఆధానం జరిపించి వంశాన్ని కాపాడుకోవచ్చని ...దానినే దేవర న్యాయం అంటారని భీష్ముడు చెప్పాడు


అప్పుడు సత్యవతి..శంతనుడితో వివాహానికి ముందు పరాశరమహర్షికి -తనకు జన్మించిన వ్యాసుడి గురించి చెబుతుంది... ( ఈ వృత్తాంతం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి). 


తనకు సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరిపించవచ్చా అని అడిగింది. వ్యాసమహర్షి పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రమాణం చేశాడు. తనను కన్నతల్లి గంగ వలె...ఆమె కూడా పరమపవిత్రమూర్తి అని సత్యవతి అడుగుపెట్టడంతో తన వంశం పావనం అయిందని అన్నాడు. 


తాను స్మరించగానే రావాలని వ్యాసుడి దగ్గర మాట తీసుకుంటుంది సత్యవతి..ఆ మేరకు సత్యవతి తలుచుకోగానే తల్లిముందు ప్రత్యక్షమయ్యాడు వ్యాసమహర్షి.  సత్యవతి వ్యాసమహర్షికి పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి  వంశోధ్దరణ చేయమని కోరింది.


పెద్ద కోడలు అయిన అంబికను వ్యాసునివద్దకు పంపించింది సత్యవతి- నల్లని జఠలతో భయంకరమంగా ఉన్న వ్యాసుడిని చూసి ఆమె బలంగా కళ్లుమూసుకుంది..అందుకే ఆమెకు బలవంతుడైన కుమారుడు అంధుడిగా జన్మించాడు..అతనే  ధృతరాష్ట్రుడు.


రెండో రోజు రెండో కోడలైన అంబాలికను పంపించింది...ఆమె వ్యాసమహర్షితో తేజస్సు చూసి భయపడి పాలిపోయినట్టు అయిపోయింది.. ఆమెకు పాండు వర్ణంతో జన్మించిన కుమారుడే పాండురాజు..


అంబికకు గుడ్డివాడైన పుత్రుడు కలిగినందుకు దుఃఖించింది సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపించింది..అత్తగారి మాట కాదనలేకపోయినా అంబిక మనసు అంగీకరించలేదు.. అప్పుడు దాసిని తనలా అలంకరించి వ్యాసుని వద్దకు పంపించింది. ఆమెకు కలిగిన కుమారుడే..విదురుడు


ధృతరాష్ట్రుడి కుమారులు కౌరవులు
పాండురాజు కుమారులు పాండవులు


Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!


దేవర న్యాయం  


భర్త చనిపోయన స్త్రీ...తన భర్త సోదరుడిని వివాహం చేసుకని వంశాన్ని నిలబెట్టవచ్చు. స్త్రీకి సామాజిక, ఆర్థిక సంరక్షణ కల్పించాల్సిన బాధ్యత పురుషుడిది...అందుకే ఏ కుటుంబం వల్ల స్త్రీ నష్టపోయిందో ఆ కుటుంబంలోనే ఆమెకు రక్షణ కల్పించాలన్నదే దేవరన్యాయం ఉద్దేశం. 


భార్యా భగినీ న్యాయం


ఓ వ్యక్తి భార్య చనిపోతే...భార్య సోదరి అవివాహిత అయితే ఆమెను పెళ్లిచేసుకోవడం. కుటుంబంలో ఆర్థిక, సామాజిక సంరక్షణ కల్పించేందుకే ఈ న్యాయాలు ఏర్పాటు చేశారు.


Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!