YS Jagan : వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వాదనను సమర్థిస్తూ వ్యక్తం చేసిన అభిప్రాయం హైలెట్‌గా మారుతోంది. నిజానికి అందులో కాంగ్రెస్ ప్రస్తావన తీసుకు రాలేదుకానీ.. హర్యనా ఎన్నికల్లో ఈవీఎంల వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ కూటమి గెలిచిన జమ్మూకశ్మీర్ విషయంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు కానీ.. హర్యానా విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గెలిచేస్తామనుకన్న చోట ఓడిపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఈవీఎంల విషయంలో వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఇండీకూటమి పార్టీల నుంచి పెద్దగా సపోర్ట్ రావడం లేదు కానీ.. జగన్ మాత్రం కాంగ్రెస్ వాదనను సమర్థిస్తూ ముందుకు వచ్చారు.
బీజేపీ ఈవీఎంల వల్లే గెలుస్తుందన్నట్లుగా జగన్ అనుమానాలు
బీజేపీ ఈవీఎంల వల్లే గెలుస్తుందన్నట్లుగా జగన్ పెట్టి ట్వీట్ కలకలం రేపుతోంది. హర్యానా ఎన్నికలను ఏపీ ఎన్నికలతో పోల్చారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి తన ఓటమికి ఈవీఎంలే కారణం అని నమ్ముతున్నారు. హర్యానాలోనూ అలాగే గెలిచారని అంటున్నారు. అంటే.. బీజేపీకి వస్తున్న ప్రతి విజయం ఈవీఎంల వల్లేనని జగన్ అనుమానిస్తున్నట్లే అనుకోవాలి. బీజేపీతో ఇంత కాలం సత్సంబంధాలు నడిపిన జగన్ ఇప్పుడు నేరుగా బీజేపీపై ఈవీఎం తరహా ఆరోపణలు చేయడం కొత్త రాజకీయం అనుకోవచ్చు. ఇటీవల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయన ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలందరికీ లేఖలు రాశారు. కానీ కాంగ్రెస్ నేతలకు ఎలాంటి లేఖలు రాయలేదు. మరో వైపు ఢిల్లీలో జరిపిన ధర్నాకు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి.
ఈవీఎంలతోనే కదా ఇప్పటి వరకూ గెలిచింది - జగన్‌కు ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఈవీఎంలను గతంలో గట్టిగా సమర్థించిన జగన్
ఈవీఎంలపై ఎప్పుడూ ఒకటే వాదనతో ఉంటే జగన్ అభిప్రాయానికి విలువ లబించేదేమో . 2019లో చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొన్ని పార్టీలు సుప్రీంకోర్టులో ఈవీఎంలపై పిటిషన్లు వేశాయి. ఆ సమయంలో జగన్ ఈవీఎంలకు మద్దతుగా మాట్లాడారు. అవి ఎంత పక్కాగా ఉంటాయో ఆయన వివరించిన తీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరయ్యాయి. ఓటేసిన ప్రతి ఒక్కరికీ వీవీ ప్యాట్ మిషన్లలో స్లిప్ కనిపిస్తుందని .. వేరే పార్టీకి ఓటు పడితే అప్పుడే చెప్పరా అని వాదించారు. మరి ఇప్పుడు తాను ఓడిపోగానే ఎందుకు ఈవీఎంలను నిందిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. ఇదే సాగుతో కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం ఏమిటన్నది బీజేపీ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నగా కనిపిస్తోంది.
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
కాంగ్రెస్‌కు దగ్గరవుతానన్న సంకేతాలు బీజేపీకి పంపుతున్నారా ?
జాతీయ రాజకీయాల్లో జగన్ ఎప్పుడూ బీజేపీ వైపే ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉండటంతో టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ ఆయన బీజేపీకి మద్దతు పలుకుపూతూనే వచ్చారు. ఇటీవలల ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత తమ విషయంలో బీజేపీ పట్టించుకోవడం లేదనుకున్నారో లేకపోతే.. మరో కారణమో కానీ.. కాంగ్రెస్ కు దగ్గరవుతామన్న సంకేతాలు పంపారు. లడ్డూ కల్తీ అంశంతో పాటు అనేక అంశాల్లో ఇరప్పుడు జగన్ జుట్టు కాంగ్రెస్ చేతుల్లో ఉందని అనుకోవచ్చు.అయితే తనకు రాజ్యసభ సభ్యులు ఉన్నందున బీజేప తనపై అగ్రెసివ్ గా వెళ్లదని ఒక వేళ వెళ్తే తనకు కాంగ్రెస్ ఆప్షన్ ఉందన్న సంకేతాలను ఆయన పంపించారని భావిస్తున్నారు.