నిజామాబాద్ జిల్లాలో వీఆర్ఏ హత్యకు గురి అయిన ఘటన కలకం రేపుతోంది. జిల్లాలోని బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) మీసాల గౌతమ్ కొద్ది రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇసుక మాఫియా ఉందని మృతుడు వీఆర్ఏ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖండ్ గావ్ వీఆర్ఏగా పనిచేస్తున్న మీసాల గౌతమ్ అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారని.. అందుకే తన భర్తను చంపారని వీఆర్ఏ భార్య మహానంది ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, తాజాగా భర్త చనిపోయిన దు:ఖంలో తాను ఉంటే కేసును వాపస్ తీసుకోవాలంటూ పోలీసులు తనపై, తన కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ప్రతి రోజు మూడు నాలుగు సార్లు పోలీసులు ఇంటి వచ్చి మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన కళ్ల ఎదుటే తన భర్తను కొట్టి చంపారని వాపోయారు. పోలీసులు సాక్షులను తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. కేసు వాపస్ తీసుకుంటేనే తన భర్త ఉద్యోగం తనకు వస్తుందని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సీఐ రవీందర్ కేసును విత్ డ్రా చేసుకోవాలని నిత్యం ఇంటి వస్తున్నారని మృతుడు గౌతమ్ భార్య చెబుతోంది. సర్పంచ్ హల్దేలాల్ సంతకం ఉంటేనే తన భర్త ఉద్యోగం తనకు వస్తుందని లేదంటే ఉద్యోగం కూడా రాదంటూ బెదిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. సర్పంచ్ మేనల్లుడు, తమ్ముడు, సర్పంచ్ ఈ ముగ్గురు హత్య చేశారంటూ వీఆర్ఏ భార్య మహానంది ఆరోపిస్తున్నారు. వారిని కేసు నుంచి తప్పించేందుకే సీఐ రవీందర్ కేసును వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోమవారం ప్రజా వాణి కావటంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు మహానంది తన కొడుకు, కుటుంబ సభ్యులతో వచ్చారు. తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితురాలు వేడుకుంటున్నారు. భర్త చనిపోయి వారం రోజులు అవుతున్నా ఏ ఒక్క రెవెన్యూ అధికారి గానీ ఎమ్మార్వోగాని రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి