ఉపాధి కోసం గల్ప్ దేశానికి వెళ్లిన యువకుడు 4 గేళ్ల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి 24 గంటలు గడవక ముందే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. తన కుటుంబంతో తనివితీరా గడపక ముందే మృత్యుఒడికి చేరుకున్నాడు. స్థానికులు వెల్లడించిన వివరాలివీ..


నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ గ్రామానికి చెందిన యాట రాజేష్‌కు భార్య ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ కు వెళ్లాడు. 4 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. కుటుంబ సభ్యులను చూడాలన్న తపన, ఎంతో ఆశతో 4 ఏళ్ల తర్వాత గత నెల 27న ఇంటికి చేరుకున్నాడు. 4 ఏళ్లుగా తాను పడ్డ కష్ఠం మనసారా తన పిల్లలు, భార్య తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా చిక్కలేదు. పిల్లలతో ముద్దు ముచ్చట కూడా తీరలేదు. అప్యాయతగా వారితో గడిపిన సమయం కూడా చాలా తక్కువ.


నాలుగేళ్ల తర్వాత నాన్న వచ్చాడన్న సంతోషం అంతలోనే అవిరైపోయింది ఆ చిన్నారులకు. రాజేష్ వచ్చిన 24 గంటలు గడవక ముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం వేళ బైక్ పై బయటికి వెళ్లాడు. నర్సాపూర్ వెళ్లే మార్గంలో రైతులు వరి ధాన్యం రోడ్డుపై ఆరబెట్టారు. అక్కడ వడ్ల కుప్పపై టార్పెయిన్ లేకుండానే బండరాళ్లు పెట్టారు. చీకట్లో బండరాయి కనిపించకపోవటంతో దాన్ని ఢీ కొని రాజేష్ రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన భీంగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. 


కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మెరుగైన చికిత్స కోసం భీంగల్ ఆస్పత్రి అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. నాలుగేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రాజేష్ తమతో మనసారా మాట్లాడకముందే మృత్యు ఒడికి చేరుకోవటంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం.


అయితే రైతులు ప్రధాన రహదారులపై వడ్లు ఆరబోస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. గతంలో కూడా ఇలా రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన ఘటనలు ఉన్నాయి. హైవేలపై కూడా ఇలా వడ్లు ఆరబోసి అక్కడ బండరాళ్లు పెడుతుంటంతో రాత్రుల్లో గమనించకుండా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదానికి కారణమైన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


Also Read: TRS Boycott : పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ! కారణం అదేనా?


Also Read : ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల


Also Read: Sircilla: ప్రైవేటు వద్దు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా పెరిగిన ప్రసవాలు


Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి