Siricilla Mega Power Loom Cluster: తెలంగాణలోని సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (CPCDS) కింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి ఏడు సార్లు లేఖలు రాశామని అయినా స్పందన లేదన్నారు. చేనేత రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి మద్దతు అందడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌(Mega Power Loom Cluster) ఏర్పాటు చేసేందుకు నిపుణులైన కార్మికులు, వనరులు సిరిసిల్లలో ఉన్నాయన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తనవంతు బాధ్యతగా రాయితీలతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందన్నారు. కేంద్రం ప్రకటిస్తున్న పథకాలు, రాయితీలు ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు కేటాయిస్తున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా


కేంద్రం నుంచి సాయం అందడంలేదు


సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఇప్పటికే ఏడుసార్లు లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వ్యక్తిగతంగా సమావేశమైనప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ చేనేత రంగానికి(Textile Sector) కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. 40 శాతం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్‌ ఫండ్‌ తదితర పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.


Also Read: వరి కొనుగోలుపై బీజేపీ పోరాటం.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్


తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు


కేంద్ర పథకాలన్నీ ఎలాంటి వనరులు లేని రాష్ట్రాలకు మళ్లిస్తున్నారన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఆదరణ కల్పించకపోవడంతో విఫలయ్యామన్నారు. గతంలో వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం ప్రశంసించినా విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌(Kakatiya Mega Textile) పార్కు వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయని, తెలంగాణ యువత లబ్ది చేకురుతుందన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. 


Also Read: టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రమే అనుమతులా.. కాంగ్రెస్‌కు ఎందుకివ్వరు: రేవంత్ రెడ్డి సూటిప్రశ్న


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి