హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షోరూంలో పోకిరీలు రెచ్చిపోయారు. ఏకంగా షోరూంలోని ట్రయల్స్ రూంలో కెమెరాలు పెట్టి యువతులు దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో రికార్డు చేశారు. ఇది గమనించిన యువతి గట్టిగా అరవడంతో అక్కడున్నవారు యువకులను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి ఆ వీడియోను యువకుల ఫోన్ నుంచి డిలీట్‌ చేయించారు. యువకులు వీడియో తీసిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ ఆమన్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. యువకుల ఫోన్ లో ఇలాంటి దృశ్యాలు మరికొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలు ఎక్కడైనా రికార్డు చేశారా లేక ఇంటర్ నెట్ నుంచి డౌన్‌లోడ్‌ చేశారా అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. 


(నిందితులు కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్​)


Also Read: ముసలామెను చంపి డబ్బు, నగలు దోచుకెళ్లిన మైనర్లు ! ఈ నేరం నేర్పింది ఆ టీవీ షోనే...


దుస్తులు మార్చుకుంటుండగా పోకిరీ చేష్టలు


మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా పోకిరీల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. తాజాగా హైదరాబాద్ లో ని హెట్ అండ్ ఎం షాపింగ్ మాల్‌లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. దుస్తులు ట్రయల్​చేసుకుంటున్న యువతిని ఇద్దరు పోకిరీలు వీడియో తీసేందుకు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్​లోని హెచ్​ఆండ్​ఎం షాపింగ్​మాల్​లో ఈ ఘటన జరిగింది. మాల్​కి వచ్చిన యువతి దుస్తులు ట్రయల్​చేసేందుకు దుస్తులు మార్చుకునే రూంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు ఆ యువతి వెళ్లిన గది పక్కనే ఉన్న మరో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లారు. పార్టీషన్​ పై నుంచి యువతి బట్టలు మార్చుకుంటుండగా మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ ను గమనించిన యువతి కేకలు వేసింది. అక్కడున్నవారు వెంటనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. 


Also Read: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్


స్టోర్ మేనేజర్ పై కేసు


అనంతరం పోలీసులు హెచ్​అండ్​ఎం షాపింగ్​మాల్​కు చేరుకొని యువకులు కిరీట్ అసాట్, గౌరవ్ కల్యాణ్​ను అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీసేందుకు ఉపయోగించిన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. షాపింగ్​మాల్​యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని గుర్తించిన పోలీసులు స్టోర్​రూం మేనేజర్​అమన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఇద్దరు యువకులు కస్టమర్లలాగే మాల్​లో ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 


Also Read: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..


ఇటీవల ఓ ఫుడ్ కోర్టులో


ఇటీవలే ఓ ఫుడ్​కోర్టులోని మహిళల వాష్​రూంలో ఫోన్ తో వీడియో రికార్టు చేసిన వెలుగు చూసింది. ఈ ఘటనలో మహిళ అప్రమత్తంగా ఉండటం వల్ల ముందే విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫుడ్​కోర్టులో పనిచేసే యువకుడే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. 


Also Read: కాబోయే ఎన్నారై భర్త పాడుపని.. న్యూడ్ వీడియో కాల్స్‌, సూసైడ్ చేసుకున్న యువతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి