విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే సినిమా వివాదాల్లో చిక్కుకుంది. విడుదలకు ముందే చిత్ర యూనిట్‏కు తలనొప్పులు మొదలయ్యాయి. సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో హిందువులను కించపర్చేలా సన్నివేశాలను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు పలువురు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..


కొద్ది రోజుల క్రితం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆల్ టైం ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌లో ఎక్కువగా బోల్డ్ సీన్స్ చూపించారు. సినిమా ‘టైటిల్‌ ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే టైటిల్‌కు తగ్గట్లుగానే.. ట్రైలర్‌లో అలాంటి సీన్లు ఎక్కువగా చూపించారు. అయితే, ట్రైలర్‌లో ముద్దు సన్నివేశాలు, బోల్డ్ సీన్లు చూపించేటప్పుడు ‘భజగోవిందం’ అనే పదాలతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ రూపంలో ఓ పాట వాడారు. ఇదే అసలు వివాదాలకు కేంద్ర బిందువు అయింది. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు దేవుడి పేరు బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించేలా చేయడం ఏంటని పలువురు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.


Also Read: TS EAMCET 2021: ఇవాల్టి నుంచే ఎంసెట్ పరీక్ష, కరోనా వేళ కొత్త నిబంధనలివీ.. ఈ వస్తువులకు నో ఎంట్రీ


తమ మనోభావాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే చిత్ర విడుదలను అడ్డుకొని తీరతామని వారు చిత్రయూనిట్‏ను హెచ్చరించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్‏లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


దర్శకుడి క్షమాపణ
అయితే, ఈ వ్యవహారంపై ఈ చిత్ర దర్శకుడు యుగంధర్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ట్రైలర్ కట్ చేసేటప్పుడు పొరపాటున ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడారని, దాన్ని ఎవరూ అంతగా గమనించలేదని చెప్పారు. ఏదైనా పొరపాటు తమవల్లే జరిగింది కాబట్టి.. క్షమాపణలు చెబుతున్నట్లు దర్శకుడు యుగంధర్ ఒప్పుకున్నారు. కొత్త దర్శకుడు యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి వంటి చాలా మంది సీనియర్ నటీనటులు నటించారు.


Also Read: Hyderabad: మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ఇద్దరు కార్మికులు.. ఒకరి మృతదేహం వెలికితీత, కొనసాగుతున్న గాలింపు


Also Read: Karimnagar Murder: క్యాబ్ డ్రైవర్ హత్య కేసు.. ఏకంగా 16 మంది అరెస్టు, కరీంనగర్‌లో సంచలనం