Breaking News Live: ఏప్రిల్ 11న ఏపీ మంత్రి వర్గ విస్తరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థులను ఆదుకోవాలని లేఖలో కోరారు. ఇటీవల శాసనసభలో సీఎం కేసీఆర్ ఉక్రెయిన్ విద్యార్థులను ఆదుకుంటామని ప్రకటించారు. అందుకోసం కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్టు తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. లాసెట్ మూడేళ్ల కోర్సు సహా ఇతర సెట్‌ల ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఐసెట్ మినహా మిగతావాటిని ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని జగన్ పై అప్పట్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల ఆదేశాలు జరిచేసింది. దీంతో సీఎం జగన్ ఆ కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతి : తిరుమలలో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. పాపవినాశనం వెళ్ళే మార్గంలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు తిష్టవేసింది. రెండు రోజులుగా రోడ్డు ప్రక్కనే సంచరిస్తున్న ఏనుగుల గుంపుతో శ్రీవారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపేందుకు టిటిడి అటవీ శాఖా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
BJP MLA Ramesh Tawadkar elected as Speaker of the Goa Assembly: గోవా అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రమేష్ తవాడ్కర్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నువేమ్ ఎమ్మెల్యే అలెక్సో సీక్వేరియాపై రమేష్ తవాడ్కర్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థికి 15 ఓట్లు కాగా, 24 మంది బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు వేశారు.
Chandrababu Wishes Devineni Uma : తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భవించిన రోజే మీ పుట్టిన రోజు కావడం యాదృచ్ఛికమే అయినా, పార్టీ ఆశయ సాధన కోసమే దేవినేని ఉమ అన్నట్టు శ్రమిస్తోన్న మీరు.. సదా సుఖసంతోషాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు.
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దున్నే మద్యం సేవించి ఓ యువకుడు అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేశాడని పోలీసులు తెలిపారు. యువకుడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 233 పాయింట్లు వచ్చింది. మద్యం మత్తులో కారు నడుపుతూ యువకుడు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ ఆటోతో పాటు రెండు బైక్‌లను ఢీకొట్టాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
TDP Formation Day 2022: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 29 మార్చి 1982 చారిత్రాత్మకమైన రోజు, తెలుగుజాతికి శుభదినం. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో మహూర్తబలం అంతగొప్పది. అందుకే 4దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం అన్నారు.
ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టిడిపి ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో ‘‘టిడిపికి ముందు, టిడిపి తర్వాత’’ అని చూసేలా చేసింది, చరిత్రను తిరగరాసింది. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు..టిడిపి వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయి. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యిందన్నారు బాలకృష్ణ.
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి చేపట్టగా, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు గేదెను తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సు నుజ్జు నుజ్జు కాగా 13 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కామారెడ్డి నుండి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ 13 మందిని మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
ఈ ప్రమాదంలో గేదె మృతి చెందింది. చెట్టు విరిగిపోగా.. బస్సు కిందకు దూసుకుపోయింది.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు, రైతు సమస్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘వరి పంట కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’’ అంటూ రాహుల్ తెలుగులో ట్వీట్ చేశారు.
Background
పొడి గాలులు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వడగాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 వరకు నమోదు కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అత్యధికంగా జంగమేశ్వరపురంలో 37.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అమరావతిలో 36.5 డిగ్రీలు, కావలిలో 36.3 డిగ్రీలు, నెల్లూరులో 36.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. అత్యధికంగా కర్నూలులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 39.4, నంద్యాలలో 38.8 డిగ్రీలు, తిరుపతిలో 38.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Andhra Pradesh)
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఆకాశం మేఘావృతామై ఉంటుంది. కానీ వర్ష సూచన తక్కువగా ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, రూరల్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండలు 42-43 డిగ్రీలను తాకుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.700 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,795 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,310 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,795 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,700 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,795 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -