పోడు భూముల పట్టాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే.. కేసీఆర్ కు పోడు భూముల విషయం గుర్తుకువస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్నారు. దానికోసం ఇప్పటికే.. ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎస్టీ మోర్చా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయడంపై మండిపడ్డారు. 12 శాతం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని.. ప్రశ్నించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.
'రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాం. రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై మాట్లాడుకున్నాం. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుంది.' అని బండి సంజయ్ అన్నారు.
ఎన్నికల సమయం వస్తే చాలు.. సీఎం కేసీఆర్‌కు పోడు భూముల సమస్యలు గుర్తుకు వస్తాయని బండి సంజయ్ విమర్శించారు. నాగార్జునసాగర్ ఎన్నికలు, హుజూర్నగర్ ఎన్నికలప్పుడు.. పట్టాలిస్తానని చెప్పారని గుర్తు చేశారు. 12 శాతం రిజర్వేషన్లపై హామీ ఏమైందని ప్రశ్నించారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీమంత్రి రవీంద్రనాయక్, చాడ సురేష్ రెడ్డి, హుస్సేన్ నాయక్, ఎస్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: TS High Court: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఫైర్, మార్చి 14 వరకూ డెడ్ లైన్.. లేదంటే..