ఎవరైనా వెడ్డింగ్ కార్డు ఇచ్చి మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలని పిలుస్తారు. కానీ ఆ జంటకు ఆ అదృష్టం లేకుండా పోయింది. కరోనా కారణంగా అందర్నీ పిలిచినా ఎవరూ రావొద్దని ఖరాఖండీగా చెప్పేశారు. అయ్యో ఇదేమి చోద్యం అని చాలా మంది బంధుమిత్రులు అనుకున్నారు కానీ.. వారిని నొప్పించకుండా.. గూగుల్ మీట్‌లో పెళ్లికి హాజరయ్యే ఏర్పాట్లు చేశారు. అయితే గూగుల్‌మీట్‌లో పెళ్లి చేసుకుని సంతోషపడితే పెళ్లి సంబరంలో మజా ఏముంటుంది.. పెళ్లి భోజనం ఎవరు పెడతారు?. ఈ లోటు రానీయకూడదని డిసైడయ్యారు. వెంటనే వారికి జొమాటో గుర్తుకు వచ్చింది. జోమాటలో అతిధులందరికీ విందు భోజనం బుక్ చేసేశారు. ఖచ్చితంగా పెళ్లి అయిపోయే సమయానికి పెళ్లికి రావాల్సిన వారి ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని విందు భోజనాలు వారికి చేరిపోయాయి. దీంతో పెళ్లి హాట్ టాపిక్ అయింది.
తన పెళ్లికి కరోనా అడ్డం పడినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పెళ్లి తంతును కొత్త పద్దతిలో లోటు లేకుండా చేసుకున్న ఈ జంట బెంగాల్‌కు చెందిన వారు. సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట గత ఏడాది ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా డెల్టావేవ్ అడ్డొచ్చింది. అంతే కాదు సందీపన్ సర్కార్ నాలుగు రోజులు ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదని ముహుర్తం పెట్టుకున్నారు. కానీ ధర్డ్ వేవ్ ముంచుకొచ్చేసింది. కోల్‌కతాలో కోవిడ్ ఆంక్షలు పెట్టారు. రెండు వందల మంది అతిధులకే చాన్స్ ఇచ్చారు . దీంతో గూగుల్ మీట్.. జోమాటో బాట పట్టారు.
Also Read: ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?
అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోవడంతో వీరి పెళ్లి వైరల్ అయిపోయింది. అచ్చమైన ఆన్ లైన్ మ్యారేజ్ ఎలా ఉంటుందో అలా జరిగిపోయింది. దీంతో ఈ జంట ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంత వరకూ బాగానే ఉంది కానీ.. మరి పెళ్లికి నేరుగా హాజరు కాని బంధువులు.. గూగుల్‌మీట్‌లో పెళ్లి చూసి.. జొమాటో విందు ఆరగించి.. మరి బహుమతులు ఏమీ ఇవ్వలేదా..? ఇస్తే ఎలా ఇచ్చారు ? ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఏమైనా ప్రోవైడ్ చేశారా.. వంటి వివరాలు మాత్రం ఈ జంట చెప్పలేదు. ఎంతైనా ఆన్ లైన్ తెలివి తేటలు ఎక్కువే కదా !. అయితే కొత్తజంటను ఆశీర్వదించడానికి అందరూ ఆన్ లైన్ పద్దతిలోనే గిఫ్టులు ..నగదు పంపి ఉంటారని భావిస్తున్నారు.
Also Read: పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?