పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. హఠాత్తుగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపుగా పన్నెండు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఎన్ని అక్రమాలు జరిగాయి.. ఎన్ని ఆధారాలు దొరికాయన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్
అయితే ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా సీఎం బంధువుల ఇళ్లను టార్గెట్ చేయడంపై సహజంగానే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ముఖ్య నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓ నేత ఇంట్లో రూ. 170 కోట్లకుపైగా క్యాష్ దొరికింది. తీరా తేలిందేమిటంటే ఆ వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదని.. పేరులో కన్ఫ్యూజ్ వల్ల ఐటీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారని వెళ్లడయింది. తర్వాత పేరు సరి చూసుకుని నిజమైన సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. ఆ ఎపిసోడ్ అలా ఉండగానే ఉప్పుడు ఈడీ పంజాబ్‌లో డ్యూటీ ప్రారభించింది.
పంజాబ్ సీఎం చన్నీని మానసికంగా తెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం చన్నీ కూడా అంటున్నారు. బీజేపీది దురుద్దేశమని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎలా దాడి చేశారో.. ఇప్పుడు తనపై అలా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ దాడుల్ని రాజకీయ కక్ష సాధింపుగా చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు.. బీజేపీయేత పార్టీల నేతలపై జరగడం కామన్. అందుకే విపక్ష పార్టీలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణిస్తూ ఉంటాయి. ఎన్నికల సమయంలోనే ఇలాంటిదాడులు చేస్తారని.. తర్వాత సైలెంట్ అవుతారని అనేక ఘటనలను ఉదహరిస్తున్నారు. అదే కేసులను ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరితే వారిపై విచారణ కూడా ఉండదని విమర్శిస్తున్నారు.
Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!