పంజాబ్ ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిని ప్రకటించారు పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి కావాలని 21 లక్షల మందికి పైగా పంజాబ్ ప్రజలు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఒపినీయన్ పోల్ పెట్టినట్లు తెలిపారు.
పెద్ద బాధ్యత..
తనను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ఆప్ తనకు చాలా పెద్ద బాధ్యతను అప్పగించిందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన తొలి లక్ష్యమని భగవంత్ మాన్ అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ ఎక్కువ సీట్లు సంపాదించనుందని అయితేే హంగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆప్.. పంజాబ్‌లో ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ మధ్యే ఈసారి పంజాబ్ ఎన్నికల్లో పోటీ ఉండనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.