దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9 వేలకు చేరువైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరింది.


మరోవైపు దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కి చేరింది. మరో 310 మంది కరోనాతో మృతి చెందారు.1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 14.43కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.62గా ఉంది.







వ్యాక్సినేషన్..







దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 158.04 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 80 లక్షల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 31,111 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 మంది వైరస్‌తో మృతి చెందారు. ముంబయిలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. కొత్తగా 5,956 కరోనా కేసులు నమోదయ్యాయి.


దిల్లీ..


దిల్లీలో కొత్తగా 12,537 కరోనా కేసులు నమోదుకాగా 24 మంది కొవిడ్‌తో మృతి చెెందారు.


బంగాల్.. 


బంగాల్‌లో మాత్రం కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,385 కరోనా కేసులు నమోదయ్యాయి. 33 మంది వైరస్‌తో మృతి చెందారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించింది. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే ఈ సమయంలో అనుమతి ఉంది.


పెళ్లిళ్లు సహా పలు కార్యక్రమాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. రాత్రి కర్ఫ్యూ సహా ప్రయాణ ఆంక్షలు అలానే ఉంచింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను జనవరి 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి