రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ గట్టి హెచ్చరికలు చేయడం సంచలనంగా మారింది.  గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి.  ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదని.. పలువురు ప్రముఖులపై దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లుగా చెబుతున్నారు  ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హోంశాఖకు చేరినట్టు తెలుస్తోంది. 


Also Read: పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?


పాకిస్థాన్, ఆఫ్గన్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉందని నిఘావర్గాలు గుర్తించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతోపాటు బహిరంగసభలు, కీలకమైన సంస్థలు, రద్దీ ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సమూహాలు కుట్ర చేసినట్టు ఐబీ వెల్లడించింది. డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడవచ్చని అంచనా వేశారు.   లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రర్‌ సంస్థలు ఈ ఉగ్ర ప్రణాళిక వెనుక ఉన్నాయి. 


Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?


భారత రిపబ్లిక్ వేడుకలపై టెర్రరిస్టులు ప్రతీ సారి గురి  పెడుతూ ఉంటారు.అయితే భారత నిఘా శక్తి కారణంగా ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాను బలగాలు నిర్వీర్యం చేస్తూ ఉంటాయి . అయితే ఈ సారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నారు. ఇటీవల పంజాబ్‌లో  ప్రధాని మోడీ భద్రత విషయంలో ఆందోళనకర పరిణామాలు ఏర్పడటం..  ఆ తర్వాత ఖలీస్థానీ గ్రూపుల నుంచి హెచ్చరికలు రావడంతో  పరిస్థితి మరింత సీరియస్‌ గా మారింది. 


Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!


పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఇప్పటికే కేంద్రం ఓ అంచనాకు వచ్చింది.  పంజాబ్‌పాటు ఇతర రాష్ట్రాల్లోనూ దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు దేశం మొత్తం సోదాలు పెంచారు. కీలకమైన చోట్ల భద్రతా ఏర్పాట్లు పెంచుతున్నారు. 


Also Read: భారత్‌ ఇలా చేస్తే కేసులు తగ్గుతాయి.. లాక్‌డౌన్‌ అక్కర్లేదు: WHOలో భారత ప్రతినిధి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి