దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో భారత ప్రతినిధి కీలక సూచనలు చేశారు. కరోనాపై యుద్ధంలో ఆయుధాలుగా పరిగణిస్తోన్న వ్యాక్సినేషన్, భౌతిక దూరం వంటివి పాటిస్తే లాక్‌డౌన్‌లతో పనిలేదన్నారు.
అలా చేయొద్దు..
కరోనా వ్యాప్తి అధికంగా ఉందని లాక్‌డౌన్ సహా ప్రయాణాలపై పూర్తి నిషేధాలు విధించడం సరికాదని రోడెరికో అభిప్రాయపడ్డారు. అలా పూర్తిగా నిర్బంధించడం కూడా సరైన విధానం కాదన్నారు. కేసులు ఎక్కువ ఉన్న చోట ఆంక్షలు విధిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని భారత్‌కు సూచించారు.
భారీగా కేసులు..
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ రోడెరికో ఈ సూచనలు చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9 వేలకు చేరువైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరింది.
మరోవైపు దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కి చేరింది. మరో 310 మంది కరోనాతో మృతి చెందారు.1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 14.43కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.62గా ఉంది.