ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తల్లిదండ్రుల ఇంటికి విజయవాడ పోలీసులు వచ్చారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వారు నివాసం ఉంటున్నారు.  ఓ కేసులో 22న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. తమపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదని.. తమలాంటి వారిని ఇరికించి ఏం సాధిస్తారని పీవీ రమేష్ తల్లిదండ్రులు తర్వాత మీడియాతో వ్యాఖ్యానించారు. ఇదంతా తమ అల్లుడు , ఏపీసీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆడిస్తున్న నాటకమన్నారు. 


Also Read: "స్కిల్ స్కాం కేసు"లో మాజీ ఐఏఎస్‌లు ప్రేమ్‌చంద్రారెడ్డి, పీవీ రమేష్‌లకు సీఐడీ నోటీసులు !


కొద్ది రోజుల క్రితం జూబ్లిహిల్స్‌లోని పీవీ రమేష్ ఇంటికి కూడా ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని .. అరెస్ట్ చేయడానికి కాదని ఏపీ సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ ఇంట్లో పీవీరమేష్ లేకపోవడంతో స్పీడ్ పోస్టులో నోటీసులు పంపుతామని ప్రకటించారు. ఆ నోటీసులు పంపారో.. పీవీ రమేష్ విచారణకు హాజరయ్యారో లేదో క్లారిటీ లేదు. 


Also Read: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?


అయితే పీవీ రమేష్ విచారణకు హాజరు కాలేదని ఆయన తల్లిదండ్రులకు నోటీసులు ఇవ్వలేదని తెలుస్తోంది. పీవీ రమేష్‌ కేసుకు.. ఆయన తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చిన కేసుకు సంబంధం లేదని చెబుతున్నారు.  ఇది వేరే కేసు అని.. కుటుంబపరమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీగా ఉన్న సునీల్ కుమార్ .. పీవీ రమేష్ సోదరిని వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో సునీల్ కుమార్‌పై ఆయన భార్య హైదరాబాద్‌లో 2013లో గృహహింస కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ కూడా  దాఖలైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన పీవీ రమేష్ తల్లిందండ్రులు.. కుటుంబసభ్యులపై ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?


కుటుంబసభ్యుల్లో ఉన్న విభేదాల కారణంగా.. పీవీ రమేష్ సోదరుని భార్యతో విజయవాడలో గృహహింస ఫిర్యాదు చేయించారని.. ఆ కేసును అడ్డం పెట్టుకుని తమను వేధించాలని ప్రయత్నిస్తున్నారని పీవీ రమేష్ తల్లిదండ్రులు అంటున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ అధికార వర్గాలతో పాటు  ..  రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. 


Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి